అనువాదలహరి

A Slice of Experience… Afsar, Telugu, Indian

1

How snugly the boats

Rest in the lap of the river

Reminiscing silently

The buzz of the last evening!

 

2

A veteran fisher swirls his snare

Into the body of the river

Erasing the carpet of mist

The river had pulled over it.

 

3

The village on the opposite bank

Continues to roll in sleep

Shrivelling further into the bed sheet.

 

Clutching at the river and the heavens

The Sun would slowly be creeping up

More noisier than an infant.

 

4

Abandoning the seclusion of thicket

Swallows chirp to their heart’s content.

 

5

Sh…h…h…h..! Don’t draw near for a while;

Let the sparrows, the river, the welkin and the sun

Play until they get weary and tired out

And drenched in delight.

.

Afsar

Telugu

Indian

.

Image Courtesy: Afsar's Blog : http://www.afsartelugu.blogspot.in/
Image Courtesy:         Afsar’s Blog : http://www.afsartelugu.blogspot.in/

 

.

 

అనుభవ లేశము

.

1

ఎంచక్కా నది వొడిలో 
నిద్ర తీస్తుంటాయి పడవలన్నీ,
నిన్నటి సాయంకాలపు సందడినంతా 
మౌనంగా తలపోసుకుంటూ. 

2

 

నది పరచుకున్న మంచు దుప్పటిని 
మెల్లిగా చెరిపేస్తూ 
నీటి వొంట్లోకి ఎర విసుర్తూ వుంటాడు,
వో ముసలి జాలరి.

 

3
ఆవలి వొడ్డున వూరు 
యింకా ముసుగు తన్నే వుంటుంది,
ఇంకాస్త నిద్రలోకి ముడుచుకుపోతూ. 

 

నదినీ, ఆకాశాన్నీ పొదివి పట్టుకొని
నెమ్మదిగా పైకి పాకుతుంటాడు సూర్యుడు
పిల్లాడి కన్నా అల్లరిగా. 

4

గుబురు చెట్ల ఏకాంతాన్ని విడిచి 
మనసారా కువకువలాడ్తాయి పిచ్చుకలన్నీ. 

5
కాసేపు ఇటు ఎవరూ రాకండి, 
ఆ పిచ్చుకల్నీ, నదినీ, ఆకాశాన్నీ, సూర్యుణ్ణి
ఆడుకోనివ్వండి అలసిపొయే దాకా
వాటి శరీరాలు తడిసి ముద్దయ్యే దాకా.

.

అఫ్సర్

 

%d bloggers like this: