నన్ను ఆలోచించనీ… ఫైజ్ అహ్మద్ ఫైజ్ , భారత- పాకిస్తానీ కవి
జ్ఞాపకాలు మరుగునపడుతున్న దేశం గురించి
నువ్వు వివరాలు అడుగుతున్నావు,
దాని భౌగోళిక స్వరూపం గాని,
దాని చరిత్ర గాని జ్ఞప్తిలో లేవు.
ఒక వేళ జ్ఞాపకాల్లోకి ప్రయాణించాల్సి వస్తే,
చాలా రోజుల తర్వాత, ఏ ప్రేమోద్వేగమూ లేకుండా,
ఏ పశ్చాత్తాపభయమూ లేని ఒక రాత్రి గడిపే
మాజీ ప్రియుడిలా ఉంటుంది నా పరిస్థితి,
కేవలం మర్యాదకోసం ఒక హృదయాన్ని
పలకరించే స్థితికి చేరుకున్నానిప్పుడు.
.
ఫైజ్ అహ్మద్ ఫైజ్
13 ఫిబ్రవరి- 20 నవంబరు 1984
భారత- పాకిస్తానీ కవి.
.
.
Let Me Think
.
You ask me about that country whose details now escape me,
I don’t remember its geography, nothing of its history.
And should I visit it in memory,
It would be as I would a past lover,
After years, for a night, no longer restless with passion,
With no fear of regret.
I have reached that age when one visits the heart merely as a courtesy.
.
Faiz Ahmed Faiz
13 February 1911 – 20 November 1984
India – Pakistani Poet.
ప్రకటనలు