“వార్ధక్యం రావడం” అంటే ఏమిటి?
ఆకారంలోని శోభనీ,
కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా?
అందం దాని అలంకారాలని కోల్పోడమా?
అవును, కానీ అవొక్కటే కాదు.
మన వికసనము కోల్పోవడమే కాదు, మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా? లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి, ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా?
అవును, ఇంతే కాక, చాలా! కానీ, “అయ్యో, నేను యవ్వనంలో ఇలా అవుతుందని ఊహించ లేదే!” అని అనుకోడం కాదు; సాయం సంధ్య శొభతో పాటే మన జీవితమూ బిగువు సడలి అనుభూతిరహితమవడం కాదు. ఒక సుందరమైన నిర్వాణం!
మనసు కలత చెంది, ఎంతో ఎత్తునుండి చూస్తున్నట్టు ప్రపంచాన్ని ఏకాగ్రత సడలని భవిష్యద్దర్శన దృష్టితో చూడడం కాదు; గతకాలపు తీపి గురుతులు గుర్తుచేసుకుంటూ, ఆ రోజులు మరి రావే అని విలపించడం కాదు.
ఒకప్పుడు మనకీ యవ్వనముండేదన్న ధ్యాసలేకుండా ఎంతకీ తరగనట్టు కనిపించే రోజుల్ని గడపడం; తీక్ష్ణమైన వర్తమానమనే బందిఖానాలో ఒక నెల కొక నెల నిరుత్సాహపు వేదనతో జతచేసుకుపోడమే.
ఇది అనుభవించడమేగాదు, మన మనోంతరాళంలో, మార్పు తెస్తున్న మరుగుపడ్డ జ్ఞాపకాలకి మనం అనుభవిస్తున్న బాధని సగమే లీలగా అనుభవించడం కానీ… ఏ రకమైన భావోద్వేగమూ లేకుండా…
అన్నిటికంటే చివరి దశలో… మనం శీతల పేటికలో గడ్డకట్టుకుపోయి మన ప్రకృతికి మనమే వికృతిగా మారినపుడు, బ్రతికున్నపుడు నిందించిన ఈ ప్రపంచమే మన అమూర్త శూన్య రూపాన్ని పొగడడం వినడం.
.
మాత్యూ ఆర్నాల్డ్
24 December 1822 – 15 April 1888
ఇంగ్లీషు కవి
.
Mathew Arnold
.
Growing Old
.
What is it to grow old? Is it to lose the glory of the form, The lustre of the eye? Is it for beauty to forego her wreath? Yes, but not for this alone.
Is it to feel our strength— Not our bloom only, but our strength—decay? Is it to feel each limb Grow stiffer, every function less exact, Each nerve more weakly strung?
Yes, this, and more! but not, Ah, ’tis not what in youth we dreamed ‘t would be! ‘Tis not to have our life Mellowed and softened as with sunset-glow, A golden day’s decline!
‘Tis not to see the world As from a height, with rapt prophetic eyes, And heart profoundly stirred; And weep, and feel the fulness of the past, The years that are no more!
It is to spend long days And not once feel that we were ever young. It is to add, immured In the hot prison of the present, month To month with weary pain.
It is to suffer this, And feel but half, and feebly, what we feel: Deep in our hidden heart Festers the dull remembrance of a change, But no emotion—none.
It is—last stage of all— When we are frozen up within, and quite The phantom of ourselves, To hear the world applaud the hollow ghost Which blamed the living man.