అనువాదలహరి

యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి

తమ దేశప్రజల ఆశీస్సులు పొందిన

యోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు?

వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో

అలంకరించడానికి  హేమంతం పునరాగమించినపుడు 

ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా

గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది.

వారి తుది ఘంటికలని దివ్య హస్తాలు మోగిస్తాయి

విషాదగీతికలని అగోచర ఆకారాలు ఆలపిస్తాయి;

వాళ్ళ శరీరాలను అక్కునజేర్చుకున్న నేల ననుగ్రహించడానికి

యశస్సు, ఒక అలసిన బాటసారిలా విచ్చేస్తుంది.

అక్కడ, శోకిస్తున్న మునిలా నివసించడానికి

స్వాతంత్ర్యం  కాసేపు సేదదీరుతుంది. 

.

విలియం కాలిన్స్

25 డిశంబరు 1721 – జూన్ 12, 1759

ఇంగ్లీషు కవి

.

William Collins

.

How Sleep the Brave

.

How sleep the brave, who sink to rest   

By all their country’s wishes blest! 

When Spring, with dewy fingers cold,    

Returns to deck their hallow’d mould,    

She there shall dress a sweeter sod          

Than Fancy’s feet have ever trod.  

By fairy hands their knell is rung; 

By forms unseen their dirge is sung;       

There Honour comes, a pilgrim grey,      

To bless the turf that wraps their clay;    

And Freedom shall awhile repair   

To dwell, a weeping hermit, there!

.

William Collins.

25 December 1721 – 12 June 1759

English Poet

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Arthur Quiller-Couch, Ed. 1919.

http://www.bartleby.com/101/458.html

 

ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

తోట వాకిలి తెరుచుకుంటుంది,

సేవకుడికుండే విధేయతతో

బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా;

తోటలోకి ప్రవేశించిన తర్వాత

అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా

మనసులో ముద్రవేసి ఉండడంతో

వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు.

నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ

ప్రతి జనసమూహమూ అల్లే

పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు;

వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు,

లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు.

నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు

నా మానసిక వ్యధలూ, బలహీనతలూ తెలుసు.

బహుశా మనకు భగవంతుడు ప్రసాదించిన

ఉన్నత స్థితి చేరుకోవడమంటే ఇదేనేమో :

గెలుపులూ, పొగడ్తలూ కాదు,

చెట్లూ, గుట్టలులా

నిరాకరించలేని సత్యంలో భాగంగా

మనల్ని మనల్నిగా  అంగీకరించడమే.

.

 జార్జ్ లూయిస్ బోర్హెస్,

24 August 1899 – 14 June 1986

అర్జెంటీనా కవి.

.

.

Simplicity

.

It opens, the gate to the garden

with the docility of a page

that frequent devotion questions

and inside, my gaze

has no need to fix on objects

that already exist, exact, in memory.

I know the customs and souls

and that dialect of allusions

that every human gathering goes weaving.

I’ve no need to speak

nor claim false privilege;

they know me well who surround me here,

know well my afflictions and weakness.

This is to reach the highest thing,

that Heaven perhaps will grant us:

not admiration or victory

but simply to be accepted

as part of an undeniable Reality,

like stones and trees.

.

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentinian Poet

 

Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667903

 

 

విశ్వాసం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నా ఆత్మ  నా శరీర గృహంలో ఉంటుంది

నువ్వు, రెండింటికీ స్వామివే.

కానీ, నా ఆత్మ, నిర్భయంగా హాయిగా తిరిగే

సాహసికుడిలా ఒక్కోసారి ఒదిగి ఉండదు.

అదొక శాంతిలేని, కుతూహలము వీడని  ఆభాస.

అదేం చేస్తుందో నే నెలా చెప్పగలను?

నా శరీరపు విశ్వాసాన్నైతే హామీ ఇవ్వగలను.

కానీ, నా ఆత్మకి

నీ మీద విశ్వాసం తప్పితే?

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://img.freebase.com
Image Courtesy: http://img.freebase.com

.

Doubt

.

My soul lives in my body’s house

and you have both the house and her –

But sometimes she is less your own

than a wild, gay adventurer.

A restless and an eager wraith,

How can I tell what she will do?

Oh, I am sure of my body’s faith

But what if my Soul broke

faith with you?

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American

Poem Courtesy: http://armymomhaven.com/teasdales/doubt—.php

 

 

A Sweet Calling on the Shore … Kasiraju, Telugu, Indian

Either in the wakes of those surging waves

or buried in the slightly wet sands on the shore

there lie some hushed legends.

which commune freely with every solitude.

The imprints of few footprints

erased by the sweeping waves

pleaded for attention to listen to their story.

A violent wave

which girdled my feet before receding

had introduced me the feel of moistness.

Some shells seemed giggling.

As I collected them one by one into my hand

I heard your voice from behind asking:

Are you gleaning peels of laughter?

Father! From hence,

whenever I look at the Sea, you come to mind.

.

Kasiraju

Telugu

Indian

.

Kasiraju

Kasiraju is a B.Tech (IT) from Gnyana Saraswati College of Engineering, Nizamabad and hails from Neredulanka, Esat Godavari. He works as Input Editor with  LMC Channel and lives in Hyderabad.

He published his maiden collection of Telugu poems “Bhoomadhya Rekha” in 2014.

.

తీరంలోని తీపిమాట
.

ఉవ్వెత్తునలేచే అల్లలచాటునో
తడిపొడిగా ఉన్న తీరంలోని  ఇసుకలోనో
కొన్ని ఊసులుంటై
అవి ప్రతి ఏకాంతంతోనూ కొన్ని  కబుర్లు చెప్పాయ్.

నడిచిన ముద్రపడి
అలలకు చెరిగిపోయే అడుగులు కొన్ని
కథచెబుతాం కాసేపు కూర్చోమన్నాయ్

ఉరుకుతూ ఉన్న అల ఒకటి
కాళ్ళపైకొచ్చి
తడిస్పర్శను పరిచయం చేసి పోయింది.

గవ్వలు కొన్ని నవ్వుతూ కనిపించాయ్
ఒక్కొక్కటీ ఏరి చేతిలోవేసుకుంటుంటే
నవ్వులు పోగేస్తున్నావా అంటూ
వెనకనుండి నీ మాటలు వినిపించాయ్

నాన్నా!
ఇకపై సముద్రాన్ని చూసినపుడల్లా నువ్వే గుర్తొస్తావ్.
.
కాశిరాజు
(భూమధ్యరేఖ సంకలనం నుండి)

నువ్వు నాకు విడిచిపెట్టినవి… ఎమిలీ డికిన్సన్, అమెరికను

ప్రియా! నువ్వు నాకు రెండు వారసత్వంగా వదిలావు;
మొదటిది ప్రేమ
భగవంతునికి ఆ వారసత్వం లభించి ఉంటే
అతను మిక్కిలి సంతృప్తిచెందేవాడు.

కాలానికీ శాశ్వతత్వానికీ మధ్య,
నాకూ, నీ స్మృతికీ నడుమ
సముద్రమంత విశాలమయిన
దుఃఖపు పరిమితులు మిగిల్చావు
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి

.

.

You left me

 .

You left me, sweet, two legacies,—

A legacy of love

A Heavenly Father would content,

Had He the offer of;

You left me boundaries of pain

Capacious as the sea,

Between eternity and time,

Your consciousness and me.

.

Emily Dickinson

 December 10, 1830 – May 15, 1886

American Poet

Poem Courtesy:

http://users.telenet.be/gaston.d.haese/dickinson_love.html

చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

చిన్న దేవుడికి చిన్న గుడి చాలు
చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు
నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు

చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు
చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు
నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు.

చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు
చిన్న బుర్రకి చిన్న దండ చాలు
నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు.

చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు
చిన్న ఓడకి చిన్న నావికుడు చాలు
నా చిన్న నోటుకి చిన్న చుట్ట సరిపడినట్టు

చిన్ని పొట్టకు  చిన్న తింది చాలు
కనుక ఓ సరసమైన దొరసానీ వేరే చెప్పనేల
నే తెచ్చిన చిన్న తాండ్రకి ఈ చిన్న చట్టీ చాలు.

.
రాబర్ట్ హెర్రిక్

(24 August 1591 – 15 October 1674)

ఇంగ్లీషు కవి.

.

.

A Ternary of Littles up on A Pipkin Of Jelly Sent To A Lady.

.

A little saint best fits a little Shrine

A little prop best fits a little wine

As my small cruse best fits my little wine.

A little Seed best fits a little Soil,

A little Trade best fits a little Toil,

As my small cruse best fits my little wine

A little seed best fits a little soil,

A little seed best fits a little soil,

As my small Jar best fits my little Oil.

A little Bin best fits a little Bread,

A little Garland best fits a little Head,

As my small Stuff best fits my little Shed

A little Stream best fits a little Boat,

A little Lead best fits a little Float,

As my small Pipe best fits my little Note

A little Meat best fits a little Belly,

A sweetly, lady, give me leave to tell ye,

This little Pipkin fits this little Jelly.

.

Robert Herrick

(baptized 24 August 1591 – buried 15 October 1674)

Poem Courtesy: https://archive.org/stream/homebookofversea00stev#page/1723/mode/1up

మలి ఎదుగు… విబిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి

మనిషికి తెలుసు “బర్చ్” చెట్టు ఎప్పుడూ
కొమ్మ నరకబడినచోటే పెరుగుతుందని …
అసలు అడవి సంగతే అంత,
నేనూ అదే మార్గం అనుసరిస్తాను.

ఎందుకంటే, ఇప్పుడు నా శోకం పోగొట్టబడి
నాలోని అనుమానాలు పటాపంచలయ్యేయి గనుక
నాకూ ఇక మంచిరోజులు ముందున్నాయి
నేనూ వెలుగుల్లో స్నానం చేస్తాను.
.
వినిఫ్రెడ్ వెల్స్
(1893- 1939)
అమెరికను కవయిత్రి.

.

Second Growth

.

Men know that the birch-tree always

Will grow where they cut down the pine—

This is the way of the forest,

And the same way shall be mine.

For now that my sorrow lies stricken,               5

And shadow in me is done,

I, too, shall have years of laughter,

And of dancing in the sun.

.

(Harper’s Magazine)

Winifred Welles (Pseudonym: Clare Cameron)

(1893- 1939)

American Poetess

Anthology of Magazine Verse for 1920

Ed: William Stanley Braithwaite, (1878–1962).

అందమైన వల… రాబర్ట్ గ్రేవ్స్, ఇంగ్లీషు కవి

పిల్లలు ఉదయం ఎంతవేడిగా ఉందో చెప్పలేరు,

గ్రీష్మఋతువులోని గులాబి ఎంత రసానుభూతినిస్తుందో,

ఆకాశాన ముసురుకునే మునిమాపు చీకట్లు ఎంత భయదమో,

బాజాలువాయిస్తూ పక్కనుంచిపోయే పొడవాటి సైనికపటాలం

ఎంత భయానకమో వాళ్ళు చెప్పలేరు.

కానీ, మనకి మాటలున్నాయి, ఎంత మండు వేసవి

రోజునైనా తెలియకుండా గడపడానికి; గులాబుల

భావోద్రేకతను అధిగమించగల మాటలున్నాయి,

వేలాడుతున్న చీకట్లని మాయం చెయ్యగలం,

సైనికులనీ, భయాన్నీకూడ పారద్రోలగలం.

మనని కట్టిపడేసే అందమైన పద”జాలము” ఉంది,

పట్టలేని ఆనందం నుండీ, భయాన్నుండీ రక్షణ నివ్వగలది;

కడకి మనందరం జీవకళతప్పి, చల్లబడి, …  చనిపోవలసిందే

కన్నీటితోనో… వాచాలతతోనో.

కానీ ఆ పిల్లల్లా మిరుమిట్లు గొలిపే వేసవి పొద్దునూ,

గులాబినీ, చీకటి ఆకాశాన్నీ చూస్తునో, బాజాల్నీ వింటూనో

మరణమాసన్నమైనపుడు కాకుండా, అంతకుముందే

భాషనీ, దాని ప్రవాహ బలాన్నీ గాలికి వదిలేసి

మన మాటలపై అదుపులేకుండా మాటాడితే,

మనకి పిచ్చెక్కడమే కాదు, నిస్సందేహంగా, అలాగే మరణిస్తాం కూడా.

.

రాబర్ట్ గ్రేవ్స్

24 July 1895 – 7 December 1985

ఇంగ్లీషు కవి

.

Robert Graves

.

The Cool Web

.

Children are dumb to say how hot the day is,

How hot the scent is of the summer rose,

How dreadful the black wastes of evening sky,

How dreadful the tall soldiers drumming by,

 

But we have speech, to chill the angry day,

And speech, to dull the roses’s cruel scent,

We spell away the overhanging night,

We spell away the soldiers and the fright.

 

There’s a cool web of language winds us in,

Retreat from too much joy or too much fear:

We grow sea-green at last and coldly die

In brininess and volubility.

 

But if we let our tongues lose self-possession,

Throwing off language and its watery clasp

Before our death, instead of when death comes,

Facing the wide glare of the children’s day,

Facing the rose, the dark sky and the drums,

We shall go mad, no doubt, and die that way.

 .

 Robert Graves

24 July 1895 – 7 December 1985

English Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/12/cool-web-robert-graves.html

డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి

నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు,

గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడు

ఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు,

ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు;

అప్పుడు, నేను  రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయే

ఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు.

ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు;

నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో;

బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు,

అదృష్టం బాగుంటే భావితరాలు దీన్ని ఆదరించవచ్చు.

నీ నిష్క్రమణతో పాటు ఈ రంగులు వెలిసిపోయేవి కావు

నువ్వూ, నేనూ మరణించినా ఇవి మిగిలే ఉంటాయి;

ఇవి మిగిలితే, ఈ చిత్రం వల్ల నువ్వూ జీవించే ఉంటావు;

అవి ఉంటాయి, కనుక నీకు మరణం లేదు.

.

(1592)

శామ్యూల్ డేనియల్,

16 వ శతాబ్ది

ఇంగ్లీషు కవి

.

(From)  Delia

34

When winter snows upon thy golden hairs,

And frost of age hath nipped thy flowers near;

When dark shall seem thy day that never clears,

And all lies with’red that was held so dear;

Then take this picture which I here present thee,

Limned with a pencil1not all unworthy.

Here see the gifts that God and nature lent thee;

Here read thy self and what I suff’red for thee.

This may remain thy lasting monument,

Which happily2 Posterity may cherish.

These colors with thy fading are not spent;

These may remain when thou and I shall perish.

If they remain, then thou shalt live thereby;

They will remain, and so thou canst not die.

.

(1592)

Samuel Daniel

English Poet

16th Century

(Note: 1. Limned with a Pencil: Painted With a Brush

2. Happily: Perhaps)

Poem Courtesy:

http://www.wwnorton.com/college/english/nael/noa/pdf/27636_16u37Daniel.1_2.tp.pdf

ప్రవాసం లో ప్రేమగీతం… స్టీపెన్ రుడాన్ స్కీ, యుక్రేనియన్ కవి

ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు!
ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను.
అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను—
కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ  వీచు.

అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది,
కనుమలో ఒక పల్లె ఉంది,
ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది,
ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ.

అక్కడ ఓ మారుతమా, సడిచేయకు, నెమ్మది!
ఆమె ముఖం మీద నిశ్చలంగా సేదదీరు;
నువ్వు ఆమె గులాబిరంగు  ముఖం మీదకు వంగి
పరికించు. నా మనోహారిణి నిద్రిస్తోందా?

లేక నా గువ్వ మేలుకుని ఉందా?
ఆమె నిద్రించకపోతే, ఆమె కలగనేలా చెయ్యి
ఆమె ఎన్నటికీ మరిచిపోనని మాటిచ్చిన
ఆమె మనసైనవాడు, కలలో కనిపించేలా.

కానీ ఓ పవనమా! ఆమె నను మరిచినట్టయితే,
మరొకరు ఆమె ప్రేమ చూరగొన్నట్టయితే…
అక్కడే ఉండిపో….
తిరిగి ప్రవాసంలో ఉన్న నాదగ్గరకు రాకు!

. . . . . .

యుక్రెయిన్ మీద గాలి వీచుతూనే ఉంది…
నా మనసు పరితపిస్తూనే ఉంది: బాధతో నిండి …
మారుతము  యూక్రెయిన్ దిశగా సాగిపోయింది,
కాని అది వెనకకి మరలి రాలేదు.
.
స్టీపెన్ రుడాన్ స్కీ

6 January 1834 – 3 May 1873

 యుక్రేనియన్ కవి

 .

Stepan Rudansky

Stepan Rudansky

Image Courtesy: http://www.encyclopediaofukraine.com/display.asp?linkpath=pages\R\U\RudanskyStepan.htm

.

Song from Exile

.

Blow, O Wind, unto my Ukraine!

For I left there a sweet maiden.

Yea, two dark-brown eyes I left there–

Blow, thou wind, from midnight onward.

 

There in Ukraine lies a valley,

In the valley there’s a Khuta;

In the hut there dwells a maiden–

Little maiden, wild she-pigeon.

 

There, O Wind, Hush and be silent!

Rest above her face in quiet;

Bow above her rosy face, thou;

Look: is she, my sweetheart, sleeping?

 

Or is she awake, my pigeon?

If she sleeps not, set her dreaming

Of the one she loved, her dearest,

Whom she swore she would forget not.

 

But, O Wind, if she forget me,

If she have another wooer. . . .

Die away in Ukraina–

Come not back to me in exile!

 

. . . . . .

 

And the wind blows on through Ukraine . . .

My heart weeps: ’tis full of sorrows . . .

And the wind fled into Ukraine,

And it never turned backward.

.

(Translation by:  Florence Randal Livesay )

Stepan Rudansky

6 January 1834 – 3 May 1873

Ukrainian Poet

Poem Courtesy: http://digital.library.upenn.edu/women/livesay/ukraina/ukraina.html#82

 

 

%d bloggers like this: