జీవితం హాయిగా ఉంది… లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను

నేను నది ఒడ్డుకి వెళ్ళేను,
ఒడ్డున కూచున్నాను; ఆలోచించడానికి
ప్రయత్నించేను గాని కుదరలేదు.
అందుకని అందులోకి గెంతి మునకవేశాను.

ఒక సారి పైకి వచ్చి గట్టిగా అరిచేను
రెండో సారి పైకి వచ్చి బిగ్గరగా అరిచేను!
ఆ నీళ్ళేగాని చల్లగా ఉండి ఉండకపోతే
అందులో మునిగి చచ్చిపోయేవాడిని.  

కానీ ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి!  చాలా చల్లగా!
*
నేను ఎలివేటరు ఎక్కేను
క్రిందనుండి పదహారో అంతస్థుకి.
నా బిడ్డ గురించి ఆలోచించేను.
ఒక్కసారి కిందకి దూకెద్దామా అనిపించింది.

నే నక్కడ నిలబడి అరిచేను!
అక్కడే నిలబడి విలపించేను!
నేనే గాని అంత ఎత్తున ఉండకపోతే
నేను కిందకి దూకి చచ్చిపోయేవాడిని.

కానీ అక్కడ ఎత్తుగా ఉంది! చాలా ఎత్తుగా!
*
నేను ఇంకా ఇక్కడ బతికే ఉన్నాను కనుక
నేనిక ఇక బతికీగలనని అనుకుంటున్నాను.
నేను ప్రేమకోసం మరణించి ఉండొచ్చు,
కాని నేను పుట్టింది బతకడానికి.  

నువ్వు నా అరుపులు విని ఉండొచ్చు
నేను ఏడవడమూ చూసుండొచ్చు…
కానీ, మనసైన పిల్లా, నేను నరకానికి పోతాను
నువ్వు నేను ఆత్మహత్య చేసుకోవడం చూస్తే!  
 
జీవితం బాగుంది! మదిర అంత! జీవితం హాయిగా ఉంది!

.

లాంగ్ స్టన్ హ్యూజ్

అమెరికను.

.

Image courtesy: http://4.bp.blogspot.com
Image courtesy: http://4.bp.blogspot.com

 

.

Life Is Fine

I went down to the river,
I set down on the bank.
I tried to think but couldn’t,
So I jumped in and sank.

I came up once and hollered!
I came up twice and cried!
If that water hadn’t a-been so cold
I might’ve sunk and died.

But it was Cold in that water! It was cold!

I took the elevator
Sixteen floors above the ground.
I thought about my baby
And thought I would jump down.

I stood there and I hollered!
I stood there and I cried!
If it hadn’t a-been so high
I might’ve jumped and died.

But it was High up there! It was high!

So since I’m still here livin’,
I guess I will live on.
I could’ve died for love–
But for livin’ I was born

Though you may hear me holler,
And you may see me cry–
I’ll be dogged, sweet baby,
If you gonna see me die.

Life is fine! Fine as wine! Life is fine!

.

Langston Hughes

(February 1, 1902 – May 22, 1967)

American

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: