రోజు: జనవరి 30, 2015
-
జీవితంలో చెడు చాలా చూశాను … యూజెన్యో మోంటేల్, ఇటాలియను కవి
జీవితంలో చెడు చాలా చూశాను; ఎండిందనుకున్న దొంగయేరు అదాత్తున పొంగినట్టు, ఎండకి మాడిపోయిన ఆకులు ముడుచుకుపోయినట్టు, పరిగెడుతున్న గుఱ్ఱం దబ్బున కూలబడినట్టు. మంచి అంతగా ఎరుగను; దైవం ఎందుకు నిర్లిప్తంగా ఊరుకుందా అన్న ఆశ్చర్యం తప్ప; అది పగలే నిద్రలో మునిగిన శిలావిగ్రహం లాటిది ఎక్కడో గగనతలంలో ఎగురుతున్న డేగలాంటిది. . యూజెన్యో మోంటేల్ (12 October 1896 – 12 September 1981) ఇటాలియను కవి . . Evil I’ve often encountered in…