He is visiting to steal and stash away your riches.
Thinking with thousand brains
Man can reach out for you
stretching out hands hundred times as many;
he is running mad after you, planets,
one after another.
He can scoop out mineral wealth
with the cups of his hands;
Can chew up the rich elements like sugary wafer;
And, like a bear, can tear off your fertile wombs.
Well, if you don’t trust me,
come here and see for yourself…
The open wounds of the Earth,
the drying up once perennial springs,
wakes of disappearing greenery,
and the CFC-scissored protective layers.
Only the son of Anjana*1 tried to gobble Sun, then
There are many sons of element Vayu*2 today
who want to gobble up the earth .
His pangs of hunger start with exploration
and cease with total cessation.
His grasp was so cunning
And he has many colors up his sleeve
which even the chameleon was ignorant of.
He is the master trickster
peerless amongst all beings.
If he could land there once
all your halos disappear in a trice
All your circular rings break to smithereens.
He can transform the hot to cold and vice versa.
He can make pick-locks for the doors of universe
can confuse the creator himself
As not to identify his own creation;
Or, a mother
to dis own her own child.
Man is the essence of material form.
He is a torch that can kill you with its light;
He is a curse that has no atonement.
O you Planets! Heavenly Spheres!
Pray! Run… Run… Run away
Beyond his reach … beyond the grasp of man!
To create this universe, perhaps, one needs billion Gods.
But to annihilate it … just one man is enough!
.
(Note *1: According to Hindu Mythology, Hanuman , Son of Anjana and Vayu tried to gobble up Sun mistaking it for a fruit.
*2: Subtle reference to Gali ( Telugu name for Vayu) Janardhana Reddy, the infamous Mining Baron and his ilk. )
Dirghasi Vijaya Bhaskar
Telugu
Indian.
.
గ్రహాల్లారా! పారిపొండి!
.
అదిగో వస్తున్నాడు మనిషి
మీ వైపుకు దూసుకొస్తున్నాడు
జులపాలజుట్టు చూసిమోసపోకండి
చేతిలో గునపాలున్నవి
జాగ్రత్త పడండి!సంపదనంతా దోచుకుని
దాచుకోవస్తున్నాడు సహస్ర శిరస్సులతో
ఆలోచించి శతసహస్ర బాహువుల్ని
చాచుకుంటూ గ్రహరాశులవెంట
గంగవెర్రులెత్తుకుని వస్తున్నాడు మనిషి.
ఖనిజరాశుల్ని దోసెళ్లతో తోడెస్తాడు
ధాతు సంపదల్ని పూతరేకులుగా నమిలేస్తాడు
మీ గర్భకుహరాల్ని తోడేలై చీల్చేస్తాడు
నమ్మకపోతే ఇదిగో! ఇటుగా వచ్చిచూడండి!
భూమిగుండెలపై వేసిన సమ్మెటపోట్లు
విచ్చుకత్తులగాట్లు
ఇంకిపోతున్న జీవజలధారలు,
అంతరిస్తున్న వనాల ఆనవాళ్ళు
కలుషిత కల్మషంతో కరిగిపోతున్న
రక్షణవలయాలు
తొలచి తొలచి గుండె గుజ్జు వొలుచుకుంటున్న గనుల గుర్తులు.
సూర్యుణ్ణి మింగేసిన అంజనీపుత్రుడొక్కడే ఆనాడు
భూమిని నమిలేస్తున్న వాయునందనులెందరో ఈనాడు
వాడి ఆకలి మంట అన్వేషణతో మొదలై
అంతంతో చల్లారుతుంది
మోసకారి మొసలిపట్టు వాడిది.
ఊసరవెల్లికి తెలియని రంగులు వాడికున్నవి.
ఏ జీవికీ లేని కాపట్య ప్రతిభ వాడి స్వంతం.
ఒక్క సారి కాలు మోపాడో!
మీ తేజో వలయాలు తుత్తునియలౌతాయి
పరివేషమండలాలు పటాపంచలైపోతాయి
ఉష్ణరాశుల్ని, శీతల సాంద్రతను తారుమారుచేస్తాడు
విశ్వప్రవేశద్వారాలకు మారుతాళాలు చేస్తాడు
తన సృష్టినే బ్రహ్మ గుర్తించలేనంతగా
అమ్మ తన బిడ్డనే కాదనుకునేట్టుగా
ఏమారుస్తాడు.
భౌతిక పదార్థానికి బౌద్ధిక రూపం మనిషి.
వెలుగుతో కాల్చే దీపం వాడు
నిష్కృతిలేని శాపం వాడు.
గోళాల్లారా! గ్రహాల్లారా!
మనిషికి దొరక్కుండా
పారిపొండి… దూరం దూరంగా
ప్రకృతిని సృజించడానికి ముక్కోటి దేవతలు కావాలేమో!
వినాశానికి మాత్రం ఒక్క మనిషి చాలు!
.
దీర్ఘాశి విజయ భాస్కర్
తెలుగు
భారతీయ కవి