అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి

(జీవితంలో చివరి క్షణాన్ని చక్కగా చెప్పిన కవిత )

వేదనకి అంతిమంగా
ఒక ద్వారం తెరుచుకుని ఉంటుంది.

నన్ను చెప్పనీ:  నాకు గుర్తుంది.
దాన్ని నువ్వు మరణం అంటావు.

నెత్తిమీద ఏవో చప్పుళ్ళు.  తమాలవృక్షాల
కొమ్మలల్లాడుతున్న చప్పుడు. ఎండిన నేలమీద
ఒక్క సారి తళుక్కుమని మెరిసిన నీరెండ
చైతన్యం
చీకటి గుంతలో కప్పడిపోయాక
బ్రతకడం దుర్భరం.

దానితో  అంతా సరి: నువ్వు భయపడినంతా అయింది
ఒక ఆత్మగా మిగిలి, మాటాడలేక
అకస్మాత్తుగా ముగిసిపోవడం
బిగుసుకున్న మట్టి కొద్దిగా లొంగడం.
నేను పిట్టలని అనుకున్నవి ఒక్కసారి
పొదల్లోంచి తుర్రుమని ఎగిరిపోయాయి.

మరో ప్రపంచం నుండి
ఇక్కడకు రావడం గుర్తులేని వాళ్ళకి చెబుతున్నా
నేను మళ్ళీ మాటాడగలను:
విస్మృతిలోంచి మరలి వచ్చిన ప్రతీదీ
మాటాడగలదు:

నా ప్రాణం మధ్యలోంచి
ఒక గొప్ప ధార పైకి ఎగజిమ్మింది
నీలి సముద్ర కెరటాలమీద నల్లని నీడల్లా.
.
లూయీ ఎలిజబెత్ గ్లూక్
22 ఏప్రిల్, 1943
అమెరికను కవయిత్రి

 

The Wild Iris

.

At the end of my suffering

there was a door.

 

Hear me out: that which you call death

I remember.

 

Overhead, noises, branches of the pine shifting.

Then nothing. The weak sun

flickered over the dry surface.

 

It is terrible to survive

as consciousness

buried in the dark earth.

 

Then it was over: that which you fear, being

a soul and unable

to speak, ending abruptly, the stiff earth

bending a little. And what I took to be

birds darting in low shrubs.

 

You who do not remember

passage from the other world

I tell you I could speak again: whatever

returns from oblivion returns

to find a voice:

 

from the center of my life came

a great fountain, deep blue

shadows on azure sea water.

.
Louise Elisabeth Glück

born April 22, 1943

American Poet

Awards

 

Pulitzer Prize for Poetry (1993)

Bollingen Prize in Poetry (2001)

US Poet Laureate (2003–2004)

 

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/04/wild-iris-louise-gluck.html

 

 

 

.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: