వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

వసంతమా! ఏమి పని ఉందని మళ్ళీ వచ్చేవు?

అందాలు తోడుతెస్తే సరిపోదు.

అప్పుడే విచ్చుకుంటున్న లేలేత చిగుళ్ళ

ఎర్ర దనాన్ని చూపించి నన్ను శాంతపరచలేవు.

నాకు తెలిసిందేదో నాకు తెలుసు.

కుంకుమపువ్వు కేసరాల మొనలవంక చూస్తుంటే

మెడమీద ఎండ చుర్రుమంటోంది.

మట్టి వాసన చాలా బాగుంది.

అంటే అక్కడ మృత్యువాసనలేదన్నమాట.

అయితే దానర్థం ఏమిటి?

ఒక్క నేలలోపలే మగాళ్ళ బుర్రల్ని

పురుగులు దొలచడం లేదు.

అసలు ప్రాణం దానిమట్టుకు దాని గురించి

 ఆలోచిస్తే ఏమీ లేదు….

ఒక ఖాళీ కప్పు, తివాసీ పరచని మేడమెట్టు.

ప్రతి ఏడూ కొండ మీంచి  దిగుతూ

ఓ వసంతమా,

మూర్ఖుడిలా ఏదో వాగుతూ, పూలు విరజిమ్మితే సరిపోదు.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

February 22, 1892 – October 19, 1950

అమెరికను కవయిత్రి

 

 Edna St. Vincent Millay

 Spring

.

To what purpose, April, do you return again?

Beauty is not enough.

You can no longer quiet me with the redness

Of little leaves opening stickily.

I know what I know.

The sun is hot on my neck as I observe

The spikes of the crocus.

The smell of the earth is good.

It is apparent that there is no death.

But what does that signify?

Not only under ground are the brains of men

Eaten by maggots,

Life in itself

Is nothing,

An empty cup, a flight of uncarpeted stairs.

It is not enough that yearly, down this hill,

April

Comes like an idiot, babbling and strewing flowers.

.

Edna St. Vincent Millay

February 22, 1892 – October 19, 1950

American Poet