స్నేహం… హార్ట్ లీ కోలెరిడ్జ్, ఇంగ్లీషు కవి
సెలయేళ్ళ వెంట పరిగెడుతూ పనిలేక తిరిగినరోజుల్లో
మనుషుల ప్రేమ ఆవశ్యకత ఎన్నడూ గుర్తించలేదు.
ప్రకృతినే మనం ప్రేమించింది; మంచు తెరలపై తేలిన
ప్రశాంతత అలా కొండశిఖరాలపై తేలుతూ
మన చిత్త చాంచల్యాలని మనోహరదృశ్యాలకి మరలించింది;
మన ఆత్మ మన స్వంతం, మన హేతువు మనసుకి దాసోహమై
అలా ఎందుకు దాసోహమైనదన్న ప్రశ్నే ఉదయించలేదు.
అది తెలియని ఆనందం, దాన్ని ఎరుక హరిస్తుంది.
కానీ, నువ్వు నాకెంత ఇష్టమో ఇప్పుడు తెలుస్తోంది;
మనిషి ప్రకృతి నిధులలో సగాన్ని మించి తులతూగుతాడు
ఆ సౌందర్యాన్ని ఏ కన్నూ తిలకించనూ లేదు
ఆ మధుర సంగీతాన్ని ఏ చెవీ ప్రామాణీకరించనూ లేదు;
ఇక ఈ సెలయేరులని ఒకరి ఆనందానికి పాడుకోనీ,
ఆ మహా నగాలు మాత్రం శాశ్వతంగా నిద్రిస్తాయి.
.
హార్ట్ లీ కోలెరిడ్జ్
19 September 1796 – 6 January 1849
ఇంగ్లీషు కవి

Hartley Coleridge
.
Friendship
.
When we were idlers with the loitering rills,
The need of human love we little noted:
Our love was nature; and the peace that floated
On the white mist, and dwelt upon the hills,
To sweet accord subdued our wayward wills:
One soul was ours, one mind, one heart devoted,
That, wisely doting, ask’d not why it doted,
And ours the unknown joy, which knowing kills.
But now I find how dear thou wert to me;
That man is more than half of nature’s treasure,
Of that fair beauty which no eye can see,
Of that sweet music which no ear can measure;
And now the streams may sing for others’ pleasure,
The hills sleep on in their eternity.
.
Hartley Coleridge
(Eldest Son of ST Coleridge)
19 September 1796 – 6 January 1849
English Poet, biographer, essayist .
Poem Courtesy:
The Oxford Book of English Verse: 1250–1900.
Ed. Arthur Quiller-Couch, 1919
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి