నెత్తురోడిన కత్తులు చీకటి ఒరల్లోకి ఒద్దికగా ఒదిగిపోతాయి. నుదుటి కుంకుమ చెరిపేసుకున్న ఆకాశం దిగులు కాన్వాసుపై గీసిన ఒంటరి మేఘంలా తీరం లేని శూన్యాన్ని ఈదుతూ ఉంటుంది.
మోరలెత్తి నుంచున్న శిఖరాలన్నీ అదాటున లోయలుగా మారుతుంటాయి. రెప్పల పిడికిట్లో చూర్ణం అయిన రంగులన్నీ చీకటి ప్రవాహంలో కలిసిపోతుంటాయి.