అనువాదలహరి

నదులగురించి ఒక నల్లవాడిమాట … లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను కవి

బ్లాగు సందర్శకులకి అందరికీ
2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులకీ, మిత్రులకీ, మీ శ్రేయోభిలాషులకీ శుఖ సంతోషాలూ, అన్ని రకాల అభ్యున్నతీ కలుగజేయాలని కోరుకుంటున్నాను.
***

నాకు నదుల సంగతి తెలుసు:

మనిషి నరాల్లో ప్రవహిస్తున్న రక్తంకంటే పురాతనము,

ఈ సృష్టి అంత పురాతనమైన నదులగురించి తెలుసు.

నా ఆత్మ కూడా నదులంత అగాధం.  

పగళ్ళు ఇంకా పసిగా ఉండగానే యూఫ్రటిస్ లో స్నానం చేసేను.

కాంగో నది ఒడ్డున నా కుటీరం నిర్మించుకుంటే,

అది నన్ను హాయిగా నిద్రపుచ్చింది.

నేను నైలు నదిని పరిశీలించి అక్కడే పిరమిడ్లు నిర్మించాను.

అబ్రహాం లింకన్ న్యూ ఆర్లీన్స్ వెళ్ళినపుడు, మిస్సిస్సిపీ నది

పాటని నేను విన్నాను; సాయం సంధ్యవేళలో

కలకబారిన దాని గుండె బంగారు రంగులో మారడం చూశాను.

నాకు నదుల సంగతి తెలుసు:

అతి పురాతనమూ, నల్లనిచాయ గలవి.

నా ఆత్మ కూడా నదులంత అగాధం.

.
లాంగ్ స్టన్ హ్యూజ్

February 1, 1902 – May 22, 1967

అమెరికను

.

Image courtesy: http://4.bp.blogspot.com
Image courtesy: http://4.bp.blogspot.com

.

The Negro Speaks of Rivers

.

I’ve known rivers:

I’ve known rivers ancient as the world and older than the flow

       of human blood in human veins.

 

My soul has grown deep like the rivers.

 

I bathed in the Euphrates when dawns were young.

I built my hut near the Congo and it lulled me to sleep.

 

I looked upon the Nile and raised the pyramids above it.

I heard the singing of the Mississippi when Abe Lincoln went

       down to New Orleans, and I’ve seen its muddy bosom turn

       all golden in the sunset.

 

I’ve known rivers:

Ancient, dusky rivers.

 

My soul has grown deep like the rivers.

 

Langston Hughes 

February 1, 1902 – May 22, 1967

American

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: