రోజు: జనవరి 1, 2015
-
నదులగురించి ఒక నల్లవాడిమాట … లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను కవి
బ్లాగు సందర్శకులకి అందరికీ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులకీ, మిత్రులకీ, మీ శ్రేయోభిలాషులకీ శుఖ సంతోషాలూ, అన్ని రకాల అభ్యున్నతీ కలుగజేయాలని కోరుకుంటున్నాను. *** నాకు నదుల సంగతి తెలుసు: మనిషి నరాల్లో ప్రవహిస్తున్న రక్తంకంటే పురాతనము, ఈ సృష్టి అంత పురాతనమైన నదులగురించి తెలుసు. నా ఆత్మ కూడా నదులంత అగాధం. పగళ్ళు ఇంకా పసిగా ఉండగానే యూఫ్రటిస్ లో స్నానం చేసేను. కాంగో నది…