అనువాదలహరి

చర్చిలో… ఫెడ్కోవిచ్, యూక్రెయిన్ కవి

దేవుని మందిరం నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది.
అంతటా నిశ్చేష్టత అలముకుంది, ఎవరూ కదలడం లేదు
ఒక్క మతగురువు మాత్రమే పుస్తకంలోంచి
ప్రార్థనలు చదువుతున్నాడు;
ఉన్న ఒకే ఒక కొవ్వొత్తి తొందరగా కరిగిపోతోంది.  
గోడలమీది బంగారు విగ్రహాలు
క్రిందకి ఆశ్చర్యంతో చూస్తున్నాయి.

ఆ రాళ్ళ మీద, చల్లని కాలిబాట మీద
నాకు కనిపిస్తున్నది ఏమిటది?
ఒక యువ సైనికుడు శవపేటికలో నిద్రిస్తున్నాడు,
అతనికోసం ఏ సోదరీ శోకించడం లేదు;
ఏ తల్లీ దుఃఖంతో మూర్చపోవడం లేదు;
మైనపు కన్నీరు కారుస్తున్న కొవ్వొత్తీ
గుడ్లప్పగించి చూస్తున్న విగ్రహాలూ…
మతగురువు మృతుడికై చేసే ప్రార్థనలూ!
చివరిసారిగా ఆ అనాధకి ముద్దు ఇమ్మని వేడుకున్నాడు
ఎవరూ ముద్దుపెట్టుకుందికి వెళ్ళలేదు;
ఎవరూ వెళ్ళరు కూడా.   

ఆ నల్లని వస్త్రానికి మేకులు దిగ్గొట్టారు; కొవ్వొత్తి కరిగి రాలిపోయింది,
(ఏ సోదరీ శోకించడం లేదు;
ఏ తల్లీ దుఃఖంతో మూర్చపోవడం లేదు!)
ఈ సైనికుడు అనాధ– మరి శోకించేవారెవరు?

.

ఫెడ్కోవిచ్

(8.8.1834 –  1888)

యూక్రెయిన్ కవి

 

చివరలో  శోకించేవారెవరు? అన్న ప్రశ్నతో ఈ కవిత ముగిసినా, నిజానికి ఈ ప్రశ్నకి అసలు అంతరార్థం  తనకోసం శోకించేవారు లేనపుడు ఎవరికోసం చనిపోయినట్టు?

 

IN CHURCH

.

Sad and quiet is the House of God,

Stillness holds all and is held there.

Only the old priest reads prayers from a book;

A lonely candle is dying fast.

From the walls the statues of gold

Look down with a wondering stare.

 

And on the stones, on the cold pavement,

What do I see?

A young, dead soldier resting in a coffin,

No sister lamenting, nor mother fainting with grief;

Just a candle, dropping its wax-like tears,

And the stare of the statues,

And the priest saying prayers for the dead,

A last kiss beseeching for the dead orphan;

But none goes to kiss him. And no one will.

The black cover is nailed on; the candle, melting, falls.

(No sister lamenting, nor mother fainting with grief!)

This is a soldier, an orphan–then who should mourn?

.

(From Songs of Ukraina Tr. By Florence Randal Livesay)

JURI FEDKOVICH

(8.8.1834 –  1888)

Ukrain

http://digital.library.upenn.edu/women/livesay/ukraina/ukraina.html#87

ప్రకటనలు
%d bloggers like this: