అనువాదలహరి

చీకటి కొండలు … వాంగ్ వీ, చీనీ కవి

వర్షం ఆగిపోయింది. కొండలు ఖాళీ అయిపోయాయి.
రాత్రి రివట.  ఇప్పుడు ఆకురాలే కాలం.
పైన్ చెట్లలో అందంగా చందమామ.
రాళ్ళమీదనుండి స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు.
ఎక్కడో వేణుగీతి… ఎవరబ్బా ఇంటిముఖం పట్టింది?
ఎక్కడో కలువ కదిలిన చప్పుడు…  
ఎవరు చెప్మా బయటకు వెళుతున్నది?  
వాసంతపు సౌరభాలు ఎల్లకాలం నిలవవు.     
కాని, నువ్వు మాత్రం కలకాలం ఉండాలి.
.
వాంగ్ వీ

(699-759 AD)

చీనీ కవి

.

Night Hills

.

Rain gone. Hills are void.

Night air. Autumn now.

Bright moon in the pines.

Clear stream on the stones.

A bamboo noise – who heads home?

The lotus stirs – who sets out?

Spring scents always go.

But you – you must always stay.

.

(Translation by: AS Kline)

 

Wang Wei

(699-759 AD)

Chinese Poet

 

http://www.poetryintranslation.com/PITBR/Chinese/AllwaterWangWei.htm#Inanswer

 

ప్రకటనలు
%d bloggers like this: