అనువాదలహరి

మధుపానం… తావో చియెన్, చీనీ కవి

నలుగురూ నివసించే చోటే ఇల్లు కట్టుకున్నాను

కానీ, మాటల సందడీ లేదు, వాహనాల రొదా లేదు.

“అదెలా సాధ్యం?” అని మీరు అడగవచ్చు

మనసు దూరంగా ఉంటే, ఊరూ దూరంగానే ఉంటుంది.

 

తూరుపు దడిదగ్గర పూసిన చేమంతులు కోస్తూ

దక్షిణానికున్న కొండలవైపు చూసాను.

ఈ సాయంసంధ్యవేళ కొండగాలి హాయిగా వీస్తోంది

పక్షులు బారులు బారులుగా ఇంటిముఖం పట్టేయి.

ఇందులోనే ఏదో నిగూఢమైన సత్యం దాగుంది.

అది విప్పిచెప్పడానికి నాకు మాటలూ లేవు, మనసూ లేదు.

.

తావో చియెన్

(క్రీ. శ. 365-427)

చీనీ కవి

.

Drinking the Wine

.

I built my house near where others live.

Still there’s no sound of wheels or voices.

You’ll ask me ‘How can that be?’

When the mind is remote the place is distant.

Cutting Chrysanthemums by the Eastern Hedge,

I look out towards the Southern Hills.

Mountain air is fine at end of day.

The flights of birds make for home.

In these things there is a hint of Truth,

but trying to tell it there’s no mind, no words.

.

(Translation by AS Kline)

T’ao Ch’ien

(365-427 AD)

Chinese Poet

Poem courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Chinese/AllwaterTaoChien.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: