కట్టు కథ… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

నీ చిన్ని నీలి నీలి చేతులతో చిమ్మనగ్రోవిదగ్గర
నీళ్ళు త్రాగడం ఊహించగలను; కాకపోతే నీ చేతులు
మరీ చిన్నవి కావు, చిమ్మనగ్రోవి ఫ్రాన్సులో ఉంది;
నువ్వు అక్కడినుండే నీ ఆఖరి ఉత్తరాన్ని రాసేవు.
నేను సమాధానం ఇచ్చేనుగాని నువ్వు తిరిగి జవాబివ్వలేదు.  
నువ్వు ఏవో చాలా పిచ్చి పిచ్చి కవితలు రాస్తుండేదానివి
పెద్ద అక్షరాలలో దేచీ దేవతలంటూ;
నీకు చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు తెలుసు
అందులో చాలా మంది నీ ప్రేమికులు. ఫర్వాలేదు, నీ ఇష్టమొచ్చినట్టు
ఉండమని నేన్నీకు ఉత్తరం రాసేను, మనమెప్పుడూ కలవలేదనీ
కనుక నువ్వంటే నాకు అసూయ లేదనీ. మనమిద్దరం
న్యూ ఆర్లీన్స్ లో నాలుగిళ్ళ దూరంలో ఉన్నాం, అయినా
కలుసుకోలేదు. కనుక నువ్వు గొప్పగొప్పవాళ్ళతోటే తిరిగేవు
గొప్పగొప్పవాళ్లగురించే వ్రాసేవు. కాకపోతే,
నీకు చివరికి తెలిసొచ్చిందేంటంటే
గొప్పవాళ్ళకి వాళ్ళ పేరుగురించే ధ్యాస తప్ప
ఒక అందమైన అమ్మాయి తమతో ఉండనిగాని
వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ, మర్నాడు ఎప్పట్లా లేచి
దేముడూ, దేవతలంటూ పెద్దక్షరాలతో
ఏదో రాసుకోవడం పట్టదని.
మనకి తెలుసు దేముడు లేడని.  వాళ్ళు అదే చెప్పారు.
కాని, నాకు నిన్ను వింటుంటే నాకు సందేహం కలుగుతుంది.
దాన్ని తాటికాయంత అక్షరాలతో చెప్పాలేమో!
నాకు తెలిసి నువ్వే ఉత్తమోత్తమ కవయిత్రివి
అదే సంపాదకులకీ, ప్రచురణకర్తలకీ చెప్పాను:
“.. ఆమెవి ప్రచురించండి. ఆమెకు కొంచెం తిక్క ఉంది.
కాని ఆమె మాటల్లో మంత్రశక్తి ఉంది.
ఆమె ప్రేమలో అసత్యం లేదు,” అని.
నేను నిన్ను ప్రేమించాను…
ఒక పురుషుడు కేవలం ఉత్తరాలు మాత్రమే రాస్తూ,
ఆమె ఫొటోలు దగ్గరుంచుకోవడం తప్ప,
అన్నడూ కలుసుకోని స్త్రీని ఎలా ప్రేమిస్తాడో
అలా నేను నిన్ను ప్రేమించాను.  బహుశా మనిద్దరం
ఒక చిన్న గదిలో ఉంటూ, నేను సిగరెట్టు చుట్టుకుంటూ
ఉంటుంటే, నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమించేవాడినేమో.
కానీ, అది అలా జరగలేదు. నీ ఉత్తరాలు  రాను రాను
వేదనాభరితమవ సాగేయి. నీ ప్రేమికులు నిన్ను మోసగించేరు.
“ఓ పిల్లా! ప్రేమికులందరూ మోసగిస్తారే, ” అని రాసేన్నేను.
దానివల్ల ప్రయోజనం కనిపించలేదు.  
నువ్వు రాసేవు… నువ్వెప్పుడూ ఏడవడానికి
ఒక బెంచిమీద కూర్చుంటావనీ, అది ఓ వంతెనమీద ఉందనీ
ఆ వంతెన నదిమీద ఉందనీ. ప్రతి రాత్రీ
ఆ బెంచీ మీద కూచుని నిన్ను మరిచి, నీ మనసు
గాయం చేసిన ప్రేమికులను తలుచుకుని ఏడుస్తావని.
నేను ఉత్తరం రాసేను గాని సమాధానం రాలేదు.
నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని, అది జరిగిన
మూడు నాలుగు నెలల తర్వాత ఒక మిత్రుడు నాకు రాసేడు.
ఒక వేళ మనిద్దరం కలిసినా నేను నీకో
నువ్వు నాకో అన్యాయం చేసి ఉండేవాళ్లమేమో!
ఇది ఇలాగే ఉండడం మంచిదయింది.
.
చార్ల్స్ బ్యుకోవ్ స్కీ

అమెరికను కవి

.

 

.

An Almost Made Up Poem

I see you drinking at a fountain with tiny
blue hands, no, your hands are not tiny
they are small, and the fountain is in France
where you wrote me that last letter and
I answered and never heard from you again.

you used to write insane poems about
ANGELS AND GOD, all in upper case, and you
knew famous artists and most of them
were your lovers, and I wrote back, it’ all right,
go ahead, enter their lives, I’ not jealous
because we’ never met. we got close once in
New Orleans, one half block, but never met, never
touched. so you went with the famous and wrote
about the famous, and, of course, what you found out

is that the famous are worried about
their fame –– not the beautiful young girl in bed
with them, who gives them that, and then awakens
in the morning to write upper case poems about
ANGELS AND GOD. we know God is dead, they’ told
us, but listening to you I wasn’ sure. maybe
it was the upper case. you were one of the
best female poets and I told the publishers,
editors, “ her, print her, she’ mad but she’
magic. there’ no lie in her fire.” I loved you
like a man loves a woman he never touches, only
writes to, keeps little photographs of. I would have
loved you more if I had sat in a small room rolling a
cigarette and listened to you piss in the bathroom,
but that didn’ happen. your letters got sadder.
your lovers betrayed you. kid, I wrote back, all
lovers betray. it didn’ help. you said
you had a crying bench and it was by a bridge and
the bridge was over a river and you sat on the crying
bench every night and wept for the lovers who had
hurt and forgotten you. I wrote back but never
heard again. a friend wrote me of your suicide
3 or 4 months after it happened. if I had met you
I would probably have been unfair to you or you
to me. it was best like this.

.
Charles Bukowski

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: