అనువాదలహరి

వరుడు వెళ్ళిపోయాక… ఎలిజబెత్ మహారాణి 1

నేను దుఃఖించాలి, నా అసంతృప్తి ప్రకటించకూడదు
నేను ప్రేమిస్తున్నాను, కానీ ద్వేషిస్తున్నట్టు నటించాలి
నేను ఏ పనిచేసినా, మనసులోమాట చెప్పలేను
నేను ఉత్త మూగగా ఉంటూ లోలోపలే మాటాడుకోవాలి
నేను ఉన్నాను, కానీ లేను; వణుకుతున్నట్టున్నా దహించుకుపోతున్నాను
నేను నానుండి మరో మనిషిలా ఎప్పుడో మారిపోయాను.

నా ఇష్టాలన్నీ ఎండలో నీడలాటివి,
వెళుతుంటే వెంబడిస్తాయి, నేను వెంటాడితే దొరక్క పరిగెడతాయి
ఎప్పుడూ నా పక్కనే నిలబడి ఉంటాయి, నే చేసేది అనుకరిస్తూ.
అతను చూపించిన శ్రద్ధ తలుచుకుంటే విచారమేస్తుంది
నా మనసులోంచి అతన్ని రూపాన్ని తొలగించే మార్గం కనిపించదు
జీవితం ముగిసిన తర్వాత అణగారిపోవలసిందే.

ఏదో ఒక చిలిపి తలపు మనసులో తొంగిచూస్తుంది,
కరిగే మంచులాంటి మెత్తని నా మనసులో.
పోనీ, కఠినంగా ఉందునా? ప్రేమగానా, దయతోనా?
నేనలా తేలిపోదునా? మునిగిపోదునా? ఔన్నత్యమా? పతనమా?
మరికొంచెం హాయిగా సంతృప్తితో కాలం వెళ్ళబుచ్చుదునా?
లేక అసలు ప్రేమంటే ఏమిటో మరిచి, జీవితం చాలిద్దునా?
.
ఎలిజబెత్ మహారాణి 1

7 September 1533 – 24 March 1603
ఇంగ్లండు.

.

.

On Monsieur’s Departure

.

I grieve and dare not show my discontent,

I love and yet am forced to seem to hate,

I do, yet dare not say I ever meant,

I seem stark mute but inwardly to prate.

I am and not, I freeze and yet am burned.

Since from myself another self I turned.

My care is like my shadow in the sun,

Follows me flying, flies when I pursue it,

Stands and lies by me, doth what I have done.

His too familiar care doth make me rue it.

No means I find to rid him from my breast,

Till by the end of things it be supprest.

Some gentler passion slide into my mind,

For I am soft and made of melting snow;

Or be more cruel, love, and so be kind.

Let me or float or sink, be high or low.

Or let me live with some more sweet content,

Or die and so forget what love ere meant.

.

Queen Elizabeth I

7 September 1533 – 24 March 1603

England

ప్రకటనలు
%d bloggers like this: