ఓడ… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

కడకి ఈడ విశ్రాంతి తీసుకుఏ ఈ ఓడకి ఒకప్పుడు 
ఎత్తైన కంబమూ, బలమైన తట్టూ ఉండేవి
ఎంత చిన్నపాటి గాలి వాటు దొరికినా చాలు
విహారానికీ, ప్రయాణానికీ సిద్ధమయేది. 
పాపం,ఇప్పుడది పక్కకి ఒత్తిగిలి పడుకుంది పనిలేక,
సెలయేటితోపాటు జరజరా ప్రవహించడం మరిచిపోయి.
అయితేనేం, ఒకప్పుడు దీనిగురించి కథలు చెప్పుకునేవారు
పూలు సింగారించుకున్న చక్కని చుక్కలెందరో
దీని ముఖమండపంలో మకుటంలా ప్రకాశిస్తూ
తమకలలప్రపంచాల్ని మోసుకెళ్తుండేవాళ్ళు
లెక్కలేనన్ని కథలు చెప్పగలదది…
కానీ, గోప్యంగా ఉండడమే దానికి ఇష్టం.
రా, చిన్నారీ! కొంచెం ముందుకు రామ్మా!
నీకు చెప్పడానికి ఇంకా మరో కథ మిగిలి ఉందేమో!

.

వాల్టర్ సేవేజ్ లాండర్

30 January 1775 – 17 September 1864

ఇంగ్లీషు కవి   

The Yacht

.

The Vessel that rests here at last

Had once stout ribs and topping mast,

And, whate’er wind there might prevail,

Was ready for a row or sail.

It now lies idle on its side,

Forgetful o’er the stream to glide.

And yet there have been days of yore,

When pretty maids their posies bore

To crown its prow, its deck to trim,

And freighted a whole world of whim.

A thousand stories it could tell,—

But it loves secrecy too well.—

Come closer, my sweet girl, pray do!

There may be still one left for you.

.

Walter Savage Landor

30 January 1775 – 17 September 1864

English Writer and Poet

 

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Comp: Arthur Quiller-Couch.

http://www.bartleby.com/336/2.html

 

“ఓడ… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు

  1. “వృద్ధాప్యంలో గడచిన కథలే” కాని “కలలు” లేవనా కవి హృద్యం 🙂

    మెచ్చుకోండి

  2. శర్మ గారూ,
    నమస్తే. ఇక్కడ ముసిలివాళ్లకి కలలు ఉండడం అన్నది కాదు విషయం. ఇక్కడ వాళ్ళకి చెప్పడానికి బోల్డన్ని కథలుంటాయి గాని వినేవాళ్ళే కరువు. పట్టించుకునేవాళ్ళే ఉండరు. అందుకనే మౌనంగా ఉంటారు ఎవరైనా వినేశ్రోత దొరుకుతాడా అని ఎదురుచూస్తూ. ఎప్పుడైనా 3 వతరమే కొంతలో కొంత సహనం ప్రదర్శిస్తుంది. అందుకే, “పాపా” అని సూచించాడు 3వ తరాన్ని.
    అభివాదములతో

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.