అనువాదలహరి

Almirah Comes Within Reach… Palaparthy Indrani, Telugu, Indian

Mom is attending to her kitchen chore.

Sitting in a chair and watching her

The baby is playing with her toys.

.

“You have to study well.

You should become a doctor

When you grow up. OK?”

Said mother.

“Um.”

“Or, you want to slog before computer

Like your dad?”

“Um”

“I came first in studies

When I was a child, you know.

I was also awarded a big prize by the school.

You should also learn quickly your ABCs

And a lot lot more. OK?”

“Um”

“When you grow up

You should drive a car.

You should achieve some great things.

And earn a big name for you.

Understand?”

“Um”

Mom went on with her inventory doing her chores.

Suddenly the baby asked,

“When I grow up,

I grow tall, won’t I mommy?”

“Sure, baby! You will grow

As tall as me,” said mom

Dreaming of her daughter growing as tall as her

And occupying a chair in a famous hospital

With stethoscope hanging by her neck.

“Mom!

Then, my hands will also be long. Isn’t it?

I can then happily open this almirah

And take many chocolates, biscuits, laddus and all!

Said baby with a glint in her eye

Looking longingly at the almirah.

.

Palaparthy Indrani

Telugu

Indian

Palaparthy Indrani

Palaparthy Indrani

Palaparthy Indrani hails from  Avanigadda, Krishna district of AP.  She did Masters in Industrial Engineering.  She lives presently in New Jersey, USA.  She has  2 poetry collections Vanaku tadisina puvvokati (2005) and aDavi darilO gali paaTa (2013), and a Prose collection Bandi Ra (2013) to her credit.  You can find her books at:

http://kinige.com/author/Palaparthy+Indrani

అల్మరా అందుతుంది

.

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది.

పాప తన బొమ్మలతో కుర్చీలో కూచుంది అమ్మని చూస్తూ.

బాగా చదువుకుంటావా నాన్నా?

పెద్దయ్యాక పెద్ద డాక్టర్ వి కావాలి అన్నది అమ్మ పాపతో.

ఊ..

లేకపోతే నాన్నలాగా ఆఫీసుకు వెళ్ళి కంప్యూటర్ ముందు పని చేస్తావా?

ఊ…

అమ్మ చిన్నప్పుడు బాగా చదువుకుని ఫస్టు వచ్చింది.

అప్పుడు స్కూలు వాళ్ళు పెద్ద గిఫ్టు ఇచ్చారు తెలుసా?

నువ్వు కూడా ఏ బీ సీ లన్నీ నేర్చేసుకుని

ఇంకా ఇంకా బాగా చదూకోవాలి.

తెలిసిందా?

ఊ..

పెద్దయ్యాక కారు నడపాలి.

ఇంకా చాలా చాలా గొప్ప పనులు చెయ్యాలి.

బాగా పేరు తెచ్చుకోవాలి.

తెలిసిందా?

ఊ..

పని చేసుకుంటూ చెప్పుకుపోతోంది అమ్మ.

బెద్దయితే చాలా చాలా బొడుగు అవుతాను కదమ్మా?

అడిగింది పాప.

అవును రా. అమ్మంత పొడుగవుతావ్.

అన్నది అమ్మ

పాప తనంత అయ్యి స్టెతస్కోపు మెళ్ళో వేసుకుని

పెద్ద హాస్పిటల్లోని పెద్ద కుర్చీలో కూచుని ఉన్నట్టు ఊహిస్తూ.

అమ్మా!

అప్పుడూ నాకు చాలా చాలా బొడుగు చేతులు ఉంటాయి కదా!

అప్పుడు ఇతల అలమరా తెరిచి

చాలా చాలా

చాకొలెత్తులు, బిస్కెత్తులు, లడ్డూలు

అన్నీ తీసుకోవచ్చు!

అన్నది పాప

మెరుస్తున్న కళ్ళతో అల్మరా వంక చూస్తూ.

.

ఇంద్రాణి పాలపర్తి

తెలుగు
భారతీయ కవయిత్రి

ప్రకటనలు
%d bloggers like this: