అనువాదలహరి

శరత్తు… రిల్కే, ఆస్ట్రియను కవి

ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది.
కాలంపై ఇక నీ క్రీనీడలు ప్రసరించు,
హరితవనాలపై పిల్లగాలిని స్వేచ్ఛగా వీవనీ.

చెట్లకీ, లతలకీ పళ్ళు వేలాడమని ఆనతివ్వు; వాటికి
మరికొన్ని నులిచెచ్చని, స్వచ్ఛమైన రోజులనుగ్రహించు
అవి ఫలవంతమయేట్టు ప్రోత్సహించి, ప్రోత్సహించి, చివరగా
పళ్ళబరువుతో వాలిన తీగెల్లో తియ్యదనాన్ని నింపు.

ఇప్పుడు ఇల్లుకట్టుకోలేనివాడు ఇంకెప్పుడూ కట్టలేడు.
ఎవడు ఒంటరిగా ఉంటాడో వాడు ఒంటరిగానే మిగులుతాడు.
కూచుని చదువుకుంటూ; కాళ్ళకింద ఎండుటాలు ఎగురుతుంటే
తోటలంటా, దొడ్లంటా అటూ ఇటూ అశాంతితో తిరుగుతూ,
చీకటిపడేదాకా దీర్ఘమైన ఉత్తరాలు రాసుకుంటూ గడుపుతాడు.
.
రిల్కే
4 December 1875 – 29 December 1926
ఆస్ట్రియన్ కవి.

 

.

Autumn

 

Lord: it is time. The huge summer has gone by.

Now overlap the sundials with your shadows,

and on the meadows let the wind go free.

 

Command the fruits to swell on tree and vine;

grant them a few more warm transparent days,

urge them on to fulfillment then, and press

the final sweetness into the heavy wine.

 

Whoever has no house now, will never have one.

Whoever is alone will stay alone,

will sit, read, write long letters through the evening,

and wander along the boulevards, up and down,

restlessly, while the dry leaves are blowing.

 

.

Rainer Maria Rilke

4 December 1875 – 29 December 1926

Austrian Poet

 

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2003/11/autumn-rainer-maria-rilke.html

 

ప్రకటనలు
%d bloggers like this: