అనువాదలహరి

Here I am, there you are… Shamshad, Telugu, Indian

.

They closed the lids on the eyes

That yearned for you

And stuck staring in despair

Knowing you would never come.

Now,

A sea of grief roars

Around my stone-deaf ears

Countless cataracts stream over

But, none of them could wet me.

Before my dumb, silently asleep heart

They beat innumerable drums

The picture is the same

But each paints it in varied colours

The ideate icon is the same

But each sculpts in different word pictures

The colourful wafting fumes from the incense

Spread scents from one to the other;

Many fragrant flowers lie strewn around.

But the nose had long lost its olfactory sense.

The bod lying in state

Fails to distinguish light from darkness.

A silent grave…

Hovering over the perpetual lamp beside the head …

Awaits.

.

Shamshad

Telugu,

Indian

Shamshad

Shamshad lives in Fremont, California. She has recently published her maiden collection of poetry  “ee kitikee terucukunedi voohalloke (ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే)”

 

ఏక్ హమ్ ఔర్ ఏక్ తుమ్    

.

నీకోసం చూసి చూసి

నువ్ రావని తెలిసి

తేలేసిన నా కళ్ళను

రెప్పలతో కప్పేసారు.

 

నా ప్రక్కనే సముద్రపు హోరు దుఃఖమై

ఊదబడుతుంది వినపడని నా చెవుల్లోకి

నను తడపలేని జలపాతాలెన్నో

నా మీదనుంచి ప్రవహిస్తున్నాయి

నిశ్శబ్దంగా నిదరోతున్న నా హృదయం ముందు

ఎన్నెన్ని డప్పులై బాదుకుంటున్నాయి

 

ఇక్కడగీయబడిన చిత్రపటమొకటే

రంగులుమాత్రం ఎన్నో పూయబడుతున్నాయి

భావ శిల్పమొకటే

మాటల నగిషీలెన్నో చెక్కబడుతున్నాయి

కాలుతున్న అగరుపొగల ధూపం రంగులురంగులుగా

ఒకరినుండి మరొకరికి వాసనొస్తూనే ఉంది

శ్వాసనే ఆపేసుకున్న నాసిక

చుట్టూపడి ఉన్న పరిమళాలపుష్పాలెన్నో

వెలుగేదో చీకటేదో తెలియని స్థితిలో దేహం

ఆరకుండావెలుగుతున్న దీపం తలపై

ప్రశాంతంగా నిదరోతున్న నిశ్శబ్ద సమాధి

నీకై వేచి చూస్తుంది.

.

షంషాద్

ప్రకటనలు
%d bloggers like this: