అనువాదలహరి

A Cup of Tea … Bala Sudhakar Mauli, Telugu, Indian

After all a cup of Tea!

What would be there

That one can hold with five fingers?

A cup of tea

can bloom a warm evening…

It can instil

that much confidence as a friend can.

My friend compares

a cup of tea

to a song.

A song unites people.

On a chilly evening hour

if the few people that gather

take a warm cup of tea each

before they disperse homewards,

there wafts a fragrance

of inexplicable camaraderie.

Mother serves me

a cup of tea

soon after I get up from bed.

I can savour

Motherly love in it.

In my childhood

I used to get up before dawn

to stand in queue

to fetch my mother

a cup of tea.

In those memories

lies my life.

May be it is just

a cup of tea

but it has the capacity

to integrate a multitude.

Erasing the

Invisible lines of peeping differences

and dispelling wools of mistrust

between two intimate friends

it has a strange intimate touch

to walk them hand in hand

from today to tomorrow

What more can you expect

In a tea cup?

.

Bala sudhakar Mauli

Telugu

Indian

 Balasudhakar Mouli

కప్పు టీ

.
అవడానికి కప్పు టీయే
ఐదు చేతివేళ్ల మధ్య యిమిడే
కప్పుటీలో ఏముంటుంది –
వొక వెచ్చని సాయంత్రం
మొగ్గ తొడుగుతుంది

కప్పుటీకి
వొక మనిషి యిచ్చేటంత
విశ్వాసముంటుంది
మా మిత్రుడు
కప్పుటీని
పాటతో పోల్చుతాడు
పాట
నలుగుర్ని కలుపుతుంది
చల్లని సాయంత్రం పూట
నలుగురూ కూడి
చెరో కప్పు టీ తాగి
యిల్లకు బయలుదేరితే
వొక గొప్ప స్నేహ పరిమళమేదో
సాగనంపినట్టుంటుంది

పొద్దున్నే
నిద్రలేచిన వెంటనే
అమ్మ
వో కప్పు టీ యిస్తుంది
కప్పుటీలో
తల్లి ప్రేముంటుంది –

చిన్నప్పుడు
తెల్లారిజామునే నిద్రలేచి
టీకొట్టు ముందు క్యూ కట్టి
గ్లాసడు టీని
మా అమ్మకు తెచ్చేవాణ్ణి
అందులో
ఆ జ్ఞాపకాల్లో
నా ఊపిరుంది

కాడానికి కప్పుటీయే
కప్పుటీకి
వొక సమూహాన్ని కలిపే
గుణముంది
యిద్దరి సన్నిహితుల మధ్య
కనిపించకుండా మొలిచే
మనఃస్పర్ధలనూ
సంకోచాలనూ
చెదరగొట్టి –
వొక రోజులోంచి మరో రోజులోకి
చేయిపట్టుకుని నడిపించే
గొప్ప సాన్నిహిత్యస్పర్శేదో వుంది –

కప్పుటీలో ఏముంటుంది ?

.

 బాలసుధాకర మౌళి

ప్రకటనలు
%d bloggers like this: