రోజు: నవంబర్ 28, 2014
-
అపేక్షించదగ్గవి … మాక్స్ ఎర్మాన్, అమెరికను
ఆతృతా, రణగొణధ్వనులమధ్య శాంతంగా స్థిరంగా నడుచుకో; నిశ్శబ్దంలో ఎంత ప్రశాంతత ఉందో గుర్తుంచుకో. సాధ్యమైనంతవరకు, ఎవరికీ తలవంచకుండానే, మంచి అనుబంధాలు కలిగి ఉండు; నువ్వు సత్యాన్ని చెప్పేటప్పుడు స్పష్టంగా, నెమ్మదిగా చెప్పు; అలాగే, ఇతరులు ఏది చెప్పినా శ్రద్ధగా విను, వాళ్లు ఎంత మొద్దులూ, మూర్ఖులూ ఐనా; ఎందుకంటే, ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది. గట్టిగా అరిచి, దురుసుగా మాటాడే వాళ్ళని తప్పించుకు తిరుగు; వాళ్ళు నీ మనస్సుకి క్షోభ కలిగిస్తారు. ఇతరులతో అస్తమానం నిన్ను…