మిగతావాళ్ళందరూ అనువదిస్తారు: ఒక చిత్రకారుడు
దృశ్యమానప్రపంచాన్ని అంగీకరించినా, తృణీకరించినా;
తనజీవితంలోకితొంగిచూచి, మధించి వెలికి తీస్తాడు ప్రతిబింబాలని
ఒక కవి …వాటితో మమేకమవడానికో, విభేదించడానికో;
జీవితం నుండి కళ … అతి కష్టమైన అనుకరణ
మధ్యనున్న ఖాళీలను పూరించడానికి మనమీద ఆధారపడుతూ;
కేవలం నీ స్వరాలొక్కటే అచ్చమైన సహజ సృష్టి,
నీ పాట ఒక్కటే అపురూపమైన కానుక;
ఓ ఆనందమా! నీ సన్నిధిని మాకు కలుగజెయ్యి,
సాష్టాంగపడేలా పులకరింతలు కలుగజెయ్యి,
మా మౌనాలపై, సందేహాలపై దాడిచెయ్యి;
ఓ అజ్ఞాత గీతికా! నువ్వు, నువ్వొక్కతెవే
ఈ మా ఉనికిని తప్పు పట్టకుండా ఉన్నది;
నీ క్షమని కాదంబరిలా మాకు అనుగ్రహించు.
.
W H ఆడెన్
21 ఫిబ్రవరి – 1907 – 29 సెప్టెంబరు 1973
అమెరికను కవి.