భవిష్యత్తు ఎన్నడూ మాటాడలేదు; మూగవాళ్ళలా కనీసం ఎన్నడూ చేష్టలతోనో, సంజ్ఞలతోనో నిగూఢమైన భావి విషయాలను తెలియపరచనూలేదు. కానీ, సరియైన సమయం వచ్చినపుడుమాత్రం వాటిని అక్షరాలా ఆచరణలో చూపిస్తుంది…వాటిని తప్పించుకుందికీ, ప్రతిక్షేపించడానికీ చెయ్యగల అన్ని అవకాశాలని ముందే వమ్ముచేస్తూ. సంపదలైనా, సర్వనాశనమైనా రెంటిపట్లా దానికి ఒకే అనాశక్తత; విధి దానికి ఆదేశించిన శాసనాన్ని తు.చ. ఆచరించడమే దాని కర్తవ్యం. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి.
XXXI . The Future never spoke, Nor will he, like the Dumb, Reveal by sign or syllable Of his profound To-come. But when the news be ripe, Presents it in the Act– Forestalling preparation Escape or substitute. Indifferent to him The Dower as the Doom, His office but to execute Fate’s Telegram to him. . Emily Dickinson