ఆమె వేకువ తుషారంలా హరించిపోయింది
సూర్యుడు ఇంకా పైకి ఎగబ్రాకక ముందే;
ఆమె జీవించింది ఎంత స్వల్పసమయమంటే,
నిట్టూర్పు అంటే అర్థం ఏమిటో ఆమెకి తెలీదు.
గులాబి చుట్టూ దాని సువాసన వ్యాపించినట్టు
ఆమె చుట్టూ ప్రేమ తేలియాడింది.
గుట్టుచప్పుడుకాకుండా, మృత్యువు సమీపిస్తోందన్న
స్పృహ, భయంలేకుండా,ఆమె పెరిగింది.
ప్రేమే ఆమె సంరక్షకురాలిక్కడ
కానీ, ప్రేమే మృత్యువుముందు తలవాల్చింది
ప్రేమకి దయ కలిగినప్పుడు భయం దేనికి,
కానీ, మృత్యువు అంత దయతో ఉంటుందా?
.
హార్ట్ లీ కోలరిడ్జ్ ‘