మూడునెలలకొకసారి, కదూ, డబ్బు నన్ను దెబ్బలాడుతుంటుంది
“ఎందుకిక్కడ నన్ను ఇలా వృధాగా పడి ఉండమంటావ్?
నువ్వు ఇంతవరకు ఎరుగని వస్తువుల్నీ, సుఖాన్నీ ఇవ్వగలను.
మించిపోయిందిలేదు ఇప్పుడైనా కొన్ని చెక్కులు సంతకం చెయ్యి.”
నేను మిగతావాళ్ళవంక చూస్తాను, వాళ్ళడబ్బుల్తో ఏమిటిచేస్తారా అని. మేడమీద అయితే ఖచ్చితంగా డబ్బు దాచుకోరు. బహుశా ఈపాటికి, కారూ, పెళ్ళామూ, రెండో ఇల్లు ఉండి ఉంటుందేమో జీవితంలో డబ్బు పాత్ర చాలానే ఉందని ఒప్పుకోవాల్సిందే.
– నిజానికి, తరిచిచూస్తే, వాళ్ళలో ఒక సామాన్యధర్మం కనిపిస్తుంది: నువ్వు పదవీ విరమణ చేసేదాకా యవ్వనాన్ని ఆపలేవు కదా, నువ్వు బాంకులో ఎంత జీతం దాచుకున్నా*, నువ్వు దాచినడబ్బు చివరకి మరణశయ్యమీది క్షవరానికి **చాలదు.
నేను కాసుల సంగీతం వింటుంటాను. అదెలా ఉంటుందంటే ఫ్రెంచి కిటికీలోంచి ఒక మహా పట్టణాన్ని చూసినట్టుంటుంది, సూర్యాస్తమయవేళలో… అక్కడి మురికివాడలూ, కాలువలూ, పిచ్చిగా అలంకరించిన చర్చిలూ… ఓహ్, చాలా బాధాకరమైన దృశ్యం. . ఫిలిప్ లార్కిన్
9 August 1922 – 2 December 1985
ఇంగ్లీషు కవి
(Note: (For the terms in the original Poem)
*Bank Your Screw: (English Slang) To save in the Bank
**Shave : The fee of Mortician to make the dead body look good in the coffin)
.
Money
.
Quarterly, is it, money reproaches me:
‘Why do you let me lie here wastefully?
I am all you never had of goods and sex.
You could get them still by writing a few cheques.’
So I look at others, what they do with theirs:
They certainly don’t keep it upstairs.
By now they’ve a second house and car and wife:
Clearly money has something to do with life
– In fact, they’ve a lot in common, if you enquire:
You can’t put off being young until you retire,
And however you bank your screw*, the money you save