రోజు: నవంబర్ 20, 2014
-
పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా… లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా. నీ వాళ్ళ సమాధులమధ్య ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది; అర్థం కాని భాషలో గజిబిజిగా అల్లుకున్న ఒక సమాధి లిపిలా అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం, ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల, జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే. ఒకవేళ…