బాల-వధువు … ఊడ్గరూ నూనుక్కల్, ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి
వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు.
ఏ ఆనందమూ లేని పండు ముసలి.
బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి.
అతని గుడిశలో
నా బాల్యం సమాధి,
కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది
నేను కోరుకున్నది ప్రేమ
నా ఈడువాడే జోడు కావాలని.
చామనచాయతో నవ్వుతూ తుళ్ళే
దున్వా నన్ను ఇష్టపడ్డాడు.
ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు.
అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు!
దుఃఖం నన్ను చుట్టుముడుతోంది.
కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో
గూడుకట్టుకుని రమిస్తూ.
వాటి కువకువలకేరింతలలో
ఏ బాధ అయినా సమసిపోయేలా.
కానీ ఈ ముదుసలి గుడిసే
ఇక నా జీవిత సర్వస్వం
మిగిలింది ఎప్పుడూ ఆశల్లో విహరించడమే
ఊహల్లో దున్వాను తలుచుకోవడమే,
ఇలా కన్నీళ్ళు కార్చడమే.
.
ఊడ్గరూ నూనుక్కల్ (కేత్ వాకర్ )
3rd November 1920 – 16th September 1993
ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి.
.

Australian Aboriginal Poetess
Photo Courtesy: http://www.aiatsis.gov.au/collections/exhibitions/iaaw/women.html