నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి
వాసనచూద్దామని, నా వైపుకి
ఒక లేత గులాబి రెమ్మని వంచేను.
నేను అంతగా వంచినా,
బాగానే, విరిగిపోకుండా నిలదొక్కుకుంది.
కానీ, దాన్ని వెనక్కి వదిలెయ్యగానే
ఆ నాజూకు కొమ్మ
ఎంత హేలగా, ఎంత తూగుతో
యథాస్థితికి వచ్చిందంటే…
చెప్పడం కష్టం.
నాకు అనిర్వచనీయ ఆనందాన్నిచ్చింది.
నాకు తెలుసు… మీకేమైనా సందేహమా?
వెనుతిరిగి చూస్తే…దానిగురించే గుసగుసలుపోడం విన్నాను.
.
థామస్ ఎడ్వర్డ్ బ్రౌన్
మే 5, 1830- 29 అక్టోబరు 1897
ఇంగ్లీషు కవి
.
.
I Bended Unto Me a Bough of May
I bended unto me a bough of May,
That I might see and smell:
It bore it in a sort of way,
It bore it very well.
But, when I let it backward sway,
Then it were hard to tell
With what a toss, with what a swing,
The dainty thing
Resumed its proper level,
And sent me to the devil.
I know it did–you doubt it?
I turned, and saw them whispering about it.
.
Tom Brown
5 May 1830 – 29 October 1897
English Poet
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2000/08/i-bended-unto-me-bough-of-may-tom-brown.html