పగవాడు కలగంటున్నాడు… నార్మన్ హెచ్ రసెల్, అమెరికను కవి
ఎప్పుడైతే నా పగవాడు నిద్రపోతున్నాడని చూశానో
వాడికి ఎదురుగా నిశ్చలంగా నిలబడ్డాను
రాత్రిపూట గుడ్లగూబలా
చేపకోసం ఎదురుచూస్తున్న కొంగలా.
ఒక్క వేటు వెయ్యడానికి కత్తి ఎత్తేను.
అప్పుడు గమనించాను శత్రువు కలగనడం
అతని పెదాలమీద చిన్న దరహాసం మెరిసింది
అతని కాళ్లు వణికేయి
అతను నిద్రలో ఏవో చప్పుళ్ళు చేసేడు
అతని మనసులో ఆనందకరమైన కలే మెదిలుంటుంది.
నాకు ఒక్కడికే ఇది గుర్తుంటుంది.
మిగతావాళ్ళకి అందరికీ
నా శత్రువు గుర్రాన్ని చూపిస్తాను
ఎవరికీ ఈ విషయం చెప్పను
నా వైరిని అతని కలకి వదిలేసాను.
.
నార్మన్ హెచ్ రసెల్
Nov 3, 1921 – 14th May 2011
అమెరికను కవి
My Enemy was Dreaming
.
When I found my enemy sleeping
I stood over him and as still
as the owl at night
as the heron waiting fish
I raised my knife to kill him
then I saw my enemy was dreaming
his mouth made a little smile
his legs trembled
he made small sleep sounds
a happy dream was in his mind
only I will have this memory
I will show the others
only the horse of my enemy
I will not tells the others
I left my enemy dreaming his dream.
.
Norman H Russel
Nov 3, 1921 – 14th May 2011
American Poet
Bio and photo Courtesy: