అనువాదలహరి

A Funny Call!… Palaparthy Indrani, Telugu, Indian

My daughter got a new pal yesterday:

It’s our new neighbour’s kid.

My daughter started playing with her happily

displaying all her toys.

That kid was just picking up how to speak.

After a while they both came to me in the kitchen.

“Mommy! I want water,“ asked my daughter.

Immediately, her friend repeated,

“Mommy! I want water.”

My child did not like her friend calling me mommy.

“You should not call my mommy as mommy you know.

You should call her Aunty, understand?” she said to her.

Her friend looked perplexed.

After taking water they were back to their play in the hall.

After some more time, they came back together.

“Mom, give me a laddu!” asked my daughter.

“Mom, give me laddu,” repeated her friend.

“I told you, you should call my mommy as Aunty?”

My daughter did not hide her displeasure.

“No darling! She is only a kid.  She doesn’t know”

I tried to pacify.

She left rather reluctantly.

They came in for a third time.

“Aunty, Aunty! Give me a biscuit,” said my daughter.

“What’s this? Am I Aunty to you?

Have you forgotten how to call me?” I said.

“Give me your ear,” my daughter insisted.

I did not expect I was in for a surprise.

When I bent, she whispered secretly into my ear:

“It is just for fun Mommy!

If I call you Aunty,

She will also call you Aunty. That’s it.

You got me?”

She revealed her intentions.

“What a clever ploy!”

I wanted to say something, but refrained.

And soon, her friend asked,

“Aunty, Aunty! Give me a biscuit. “

.

Palaparthy Indrani.

Palaparthy Indrani

Palaparthy Indrani

Palaparthy Indrani hails from  Avanigadda, Krishna district of AP.  She did Masters in Industrial Engineering.  She lives presently in New Jersey, USA.  She has  2 poetry collections Vanaku tadisina puvvokati (2005) and aDavi darilO gali paaTa (2013), and a Prose collection Bandi Ra (2013) to her credit.  You can find her books at:

http://kinige.com/author/Palaparthy+Indrani

 

ఉత్తుత్తి పిలుపు

.

పాపకి కొత్త చిన్న ఫ్రెండు వచ్చింది.

 

కొత్తగా వచ్చిన పక్కింటివారి పాప.

పాపతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చింది.

పాప హాప్పీగా తన బొమ్మలన్నీ చూపించి ఆ పాపతో ఆడుకోవడం మొదలుపెట్టింది.

ఈ ఫ్రెండు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటోంది.

కొంచెంసేపయ్యాక ఇద్దరూ వంటింట్లోకి వచ్చారు.

అమ్మా! బొబ్బ కావాలి తాగడానికి అన్నది.

వెంటనే ఫ్రెండు పాప, అమ్మా! బొబ్బ కావాలి తాగడానికి! అన్నది.

తన అమ్మని ఆ పిల్ల అమ్మా అనడం పాపకి నచ్చలేదు.

ఆంతీ అనాలి.

అమ్మా అనకూడదు! తెలిసిందా? అన్నది.

అర్ధం కానట్టు చూసింది ఆ పాప.

ఇద్దరూ బొబ్బ తాగేసి మళ్ళీ ఆడుకోడానికి హాల్లోకి వెళ్ళిపోయారు.

కొంచెంసేపయ్యాక మళ్ళీ వచ్చారు పాపా, ఫ్రెండు పాపా.

అమ్మా! లడ్డూ పెత్తు! అడిగింది పాప.

అమ్మా! లడ్డూ పెత్తు! అన్నది ఫ్రెండు పాప.

అంతీ అనాలి. చెప్పానా? అన్నది పాప.

పర్వా లేదు నాన్నా. చిన్న పాప కదా! తెలీదు. అన్నది అమ్మ అనునయంగా.

కానీ పాపక్కొంచెం అసంతృప్తిగానే ఉన్నది.

మూడోసారి మళ్ళీ వచ్చారు ఇద్దరూ.

ఆంతీ!ఆంతీ! బిస్కత్తు పెత్తు అన్నది పాప.

ఆంటీ అంటున్నావేవిటి?? మర్చిపోయావా? ఆశ్చర్యపోతూ అన్నది అమ్మ.

కాదమ్మా! కిందికి దిగు చెబుతాను అన్నది పాప.

అమ్మ వంగి పాపకి చెవి వొగ్గింది.

అమ్మా! ఊరికినే! నిజంగా కాదమ్మా!

ఉత్తుత్తిగా.

నేను ఆంతీ అంతే అది కూడా ఆంతీ అంతుంది.

అందుకని.

అని చెప్పింది పాప అమ్మ చెవిలో రహస్యంగా.

ఓసి పిల్ల తెలివి బంగారంగానూ! అని మనసులో అనుకుంటూ ఏదో అనబోయింది అమ్మ.

ఇంతలోనే-

ఆంతీ!అంతీ!

బిస్కత్తు పెత్తు!

అన్నది పాప ఫ్రెండు పాప.

 

.

పాలపర్తి ఇంద్రాణి .

%d bloggers like this: