ఇమడలేనితనం… చెస్లా మీవోష్, పోలిష్ కవి

.

నేను స్వర్గంలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేను.

అది కేవలం నా జన్యువుల్లో ఉన్న బలహీనత. అంతే!

ఈ భూమ్మీద గులాబిముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ పుండయింది.
సూర్యుడిని మేఘాలుకమ్ముకున్నప్పుడల్లా, నేను బాధపడ్డాను.

ఉదయంనుండి సాయంత్రం దాకా మిగతావాళ్ళలా పనిచేస్తున్నట్టు నటిస్తాను
కాని అగోచరమైన దేశాలకి అంకితమై, నా మనసు ఇక్కడ ఉండదు.

మనః శాంతికి ఊర్లోని ఉద్యానాలకి పోతాను
అక్కడున్న చెట్లూ పూలూ ఉన్నవి ఉన్నట్టు పరిశీలిద్దామని,
కానీ, అవి నా చెయ్యి తగలగానే, నందనోద్యానాలైపోతాయి.

నా పంచేంద్రియాలతో, ఏ స్త్రీనీ నేను మోహించలేదు. ఆమెలో
బహిష్కరణకి ముందునాటి నా సోదరిని చూడాలనుకున్నాను.

నేను మతాన్ని గౌరవిస్తాను, ఎందుకంటే, ఈ బాధామయ ప్రపంచంలో
అదొక్కటే, ఇహానికీ, పరానికీ పనికొచ్చే ప్రార్థనా గీతం.
.

చెస్లా మీవోష్

30 June 1911 – 14 August 2004

పోలిష్ కవి.

.

.

Nonadaptation

.

I was not made to live anywhere except in Paradise.

 

Such, simply, was my genetic inadaptation.

 

Here on earth every prick of a rose-thorn changed into a wound.

Whenever the sun hid behind a cloud, I grieved.

 

I pretended to work like others from morning to evening,

But I was absent, dedicated to invisible countries.

 

For solace I escaped to city parks, there to observe

And faithfully describe flowers and trees, but they changed,

Under my hand, into the gardens of Paradise.

 

I have not loved a woman with my five senses.

I only wanted from her my sister, from before the banishment.

 

And I respected religion, for on this earth of pain

It was a funereal and a propitiatory song.

.

Czeslaw Milosz

30 June 1911 – 14 August 2004

Polish Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: