రోజు: నవంబర్ 6, 2014
-
57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత
నువ్వు గొప్ప నాయకుడివి కాదలచుకుంటే, తావోని చదివి అనుసరించక తప్పదు. నియంత్రించడానికిచేసే ప్రయత్నాలన్ని ఆపు. స్థిరపడిపోయిన ప్రణాళికలూ, ఆలోచనలూ వదిలెయ్ ప్రపంచం దాన్ని అదే నడిపించుకుంటుంది. నువ్వు నిషేధాలు పెంచుతున్న కొద్దీ ప్రజల నైతికతకూడా తగ్గుతుంది. నీకు ఆయుధాలు ఎక్కువయినకొద్దీ నీ ప్రజలకు అంత తక్కువ భద్రత ఉంటుంది. నువ్వు రాయితీలు ఇస్తున్నకొద్దీ ప్రజలు అంత స్వయం సమృద్ధిలేనివాళ్ళవుతారు. అందుకనే గురువు ఇలా సెలవిస్తున్నాడు: చట్టాన్ని పక్కకి తప్పించాను, ప్రజలు నిజాయితీపరులయ్యారు. ఆర్థిక సూత్రాల్ని పక్కనబెట్టాను, ప్రజలు…