అనువాదలహరి

గుడ్ నైట్, గుడ్ నైట్… జొవానా బెయిలీ, స్కాటిష్ కవయిత్రి

సూర్యుడస్తమించాడు, చీకటిపడింది,

ఆకాశంలో చుక్కలు మిణుకుమంటున్నాయి

దీపమైనా, దివిటీ అయినా ఎక్కువసేపు

ఉల్లాసమైన రోజుని ఇక పొడిగించలేవు;

ఝాములు దొంగలా తెలీకుండా జారుకున్నాయి

మనం సెలవుపుచ్చుకోక తప్పదు, గుడ్ నైట్, గుడ్ నైట్

పెళ్ళికూతురు పొదరింటిలోకి పంపబడింది,

ఆటలూ, ఆకతాయిపాటలూ ముగిసిపోయాయి;

ప్రేమికుల మాటలు పలచనై, కొందరు

అయిష్టంగా ప్రేయసికి వీడ్కోలు చెబుతున్నారు.

నాట్య రంగం ఇప్పుడు మూగబోయింది, అక్కడ

ఏ పాదమూ నర్తించడం లేదు, గుడ్ నైట్, గుడ్ నైట్!

అలరుబోడి తన ఆచ్ఛాదిత శయ్య చేరుకుంది.

పశులకాపరి తన పూరిగుడిశ చేరుకున్నాడు

గొప్పింటివాళ్ళు తమ విలాసమందిరాలు చేరుకున్నారు

మీకు అందరికీ సుఖనిద్ర కలుగుగాక!

గడచినరోజుల్లా భవిష్యత్తు హాయిగా గడవాలన్న ఆశతో

వీడ్కోలు చెప్పుకుందాం, గుడ్ నైట్ గుడ్ నైట్.

మనందరికీ కలతలేని నిద్ర కలుగుగాక!

దాని నిశ్చల ప్రశాంతతమీద

చురుకైన మనసు దృశ్యాలు పునః ప్రసరిస్తే

మరొక్క సారి ఆనందాన్ని తిరిగి అనుభవిద్దాం,

మనసు ఉల్లాసంగా,  దృశ్యాలు ఉత్సాహంగా ఉండే

మంచి మంచి కలలే అందరికీ రావాలి, గుడ్ నైట్, గుడ్ నైట్!

.

జొవానా బెయిలీ,

11 September 1762 – 23 February 1851

స్కాటిష్ కవయిత్రి.

 .

 

.

Good Night, Good Night!

.

The Sun is down, and time gone by,        

The stars are twinkling in the sky,     

Nor torch nor taper longer may

Eke out a blithe but stinted day;        

The hours have pass’d with stealthy flight,        

We needs must part: good night, good night!  

      

The bride unto her bower is sent,       

And ribald song and jesting spent;     

The lover’s whisper’d words and few

Have bid the bashful maid adieu;

The dancing floor is silent quite,        

No foot bounds there: good night, good night!     

 

The lady in her curtain’d bed,  

The herdsman in his wattled shed,     

The clansmen in the heather’d hall,

Sweet sleep be with you, one and all!

We part in hopes of days as bright    

As this gone by: good night, good night!  

   

Sweet sleep be with us, one and all!   

And if upon its stillness fall

The visions of a busy brain,     

We’ll have our pleasure o’er again,   

To warm the heart, to charm the sight,        

Gay dreams to all! good night, good night!

.

(From “The Phantom” Act I, Scene 3)

Joanna Baillie

11 September 1762 – 23 February 1851

Scottish Poetess and Dramatist

.

Poem Courtesy:

Women Poets of the Nineteenth Century. 1907.

Ed: Alfred H. Miles.

 

%d bloggers like this: