అనువాదలహరి

నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి

నేను నిలకడలేని పవనాన్ని

నువ్వు నిశ్చలమైన నేలవి;

నేను ఇసుకతిన్నెలమీద

క్షణికమై నిలిచే పదముద్రని.

నేను ఇట్టే కంపించే తలిరాకుని

నువ్వు మొక్కవోని మహా వృక్షానివి;

నువ్వు స్థిరమైన తారానివహానివి

నేను చంచలమైన నీటిపుట్టని.

నువ్వు నశ్వరమైన కాంతిపుంజానివి—

నేనొక దివిటీలా సమసిపోతాను;

ఉప్పొంగిన సంగీత కెరటానివి నువ్వు,

నే నేవో పిచ్చికూతలు కూస్తుంటాను.

.

జో ఏకిన్స్

October 30, 1886 – October 29, 1958

అమెరికను కవయిత్రి

.

Zoe Akins

.

I am the Wind

.

 

I am the wind that wavers,               

You are the certain land;

I am the shadow that passes            

Over the sand.   

I am the leaf that quivers,       

You the unshaken tree;   

You are the stars that are steadfast,               

I am the sea.      

You are the light eternal—

Like a torch I shall die;           

You are the surge of deep music,    

I but a cry!

.

.

Zoe Akins

October 30, 1886 – October 29, 1958

American Poetess

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Ed. Harriet Monroe,(1860–1936).

http://www.bartleby.com/265/5.html

%d bloggers like this: