నెల: అక్టోబర్ 2014
-
ఒక్కోసారి అలా జరుగుతుంది… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి
ఒక్కోసారి నువ్వు మంచి మిత్రుడవవుతావు తర్వాత అవకుండా పోతావు, స్నేహ వాంఛ అలా గడిచిపోతుంది. ఆ ఆలోచనలో రోజులు దొర్లిపోతాయి ఈలోపు ఒక నీటిబుగ్గ ఎండిపోతుంది. ఒక్కోసారి నువ్వంటే ఇష్టపడతారు, తర్వాత నీమీద ఇష్టం తగ్గిపోతుంది. ఇష్టం కాలగర్భంలో కలిసిపోతుంది. అందులో కొన్ని రోజులు అలా దొర్లిపోతాయి. ఈ లోగా ఒక చెలమ గడ్డిలోకి ఇంకిపోతుంది. ఒకోసారి నువ్వామెతో మాటాడదామనుకుంటావు, తర్వాత ఇప్పుడు మాటాడొద్దులే అనుకుంటావు. ఈ లోపు మాటాడే అవకాశం జారిపోతుంది. నీ కలలు ఒక్క…
-
… From being Repressed and vanquished… Mercy Margaret , Telugu, Indian
Yester night I overheard the distressing calls of the wind. Spanning their hands, When Trees tried to repress the air Making fetters of their branches and leaves I heard The Wind cry in distress For liberty. With unrestrained rage and anger When trees overpowered it I heard the distressing calls of the wind…
-
నిష్పాక్షికత … లావోజి, చీనీ కవి
అర్థంచేసుకున్నవాడు ఉపదేశాలివ్వడు; ఉపదేశాలిచ్చేవాడు అర్థం చేసుకోలేడు. నీ తీర్పులు, అభిప్రాయాలూ పక్కనబెట్టు; నీ వివేచనకి కళ్ళెం వేసి, నీ లక్ష్యాన్ని సులభంచేసుకో, ప్రపంచాన్ని ఆమోదించు. స్నేహం, శత్రుత్వం లాభం నష్టం కీర్తి, అపకీర్తి నిన్ను ఏమాత్రం తాకవు. ప్రపంచం నిన్ను అంగీకరిస్తుంది. . లావోజి చీనీ కవి తావో తే చింగ్ ( లావోజీ అనే నామాంతరం గల) క్రీ. పూ. 4 శతాబ్దపు సంకలనం నుండి. . VERSE 56 Impartiality. .…
-
సైకిలుమీద కొండ దిగుడు… హెన్రీ ఛార్లెస్ బీచింగ్, ఇంగ్లీషు కవి
కాళ్ళు పైకెత్తి, చేతులు నిలకడగా పట్టి, నేను కొండ దిగడానికి సిద్ధంగా ఉన్నాను. బాణంలా, జాగ్రత్తగా మనసుపట్టి నడుపుతుంటే గాలి పక్కనుండి సర్రున పోతోంది. జోరుగా, ఇంకా జోరుగా, గుండే ఒక్కసారి ఎవరో పైకెత్తేసినట్టు, మనసునవ్వులో తేలుతోంది, గొంతు అరుపులతో, “ఓ పక్షిరాజమా, చూడు, చూడు, నేనూ ఎగురుతున్నా. ఇదేనా, ఇదేనా నీ ఆనందహేతువు? అలా అయితే, ఓ విహంగమా నేను కుర్రాణ్ణయినా ఒక అద్భుతమైన క్షణం పాటు నీలా గాలిలో నేనూ తేలిపోయాను. ఓ హృదయమా!…
-
డాడాయిస్ట్ కవిత రాయడం ఎలా?… ట్రిస్టన్ జారా, రుమేనియన్ కవి
(18 వ శతాబ్దపు చివర ప్రారంభమై 19 వశతాబ్దపు మొదటిసగం బహుళప్రచారంలో ఉన్న కాల్పనిక వాదానికి (Romanticism) తిరుగుబాటుగా యూరోపులో వచ్చిన ఉద్యమం డాడాయిజం. దానికి ఆద్యుడు ట్రిస్టన్ జారా. పైకి ఒక వరసా, వాడీ, అర్థం పర్థం లేని కవిత్వం రాయడంగా కనిపించినప్పటికీ, దీనిలో ఒక మౌలికమైన భావన ఉంది: అది, కవిత్వం అన్నది మనం ఎలా యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చేమో, అంతే యాదృచ్ఛికంగా కవిత వస్తుంది తప్ప, “పనిగట్టుకుని రాసేది కవిత్వం…
-
ఆ గతించేది కాలం కాదు… రస్కిన్ బాండ్, భారతీయకవి
గుర్తుందా, చాలా కాలం క్రిందట మనిద్దరం తీయని బాధతో కలలు కలబోసుకున్నాం? సుదీర్ఘమైన ఆ వేసవి పగళ్ళలో, ఏదో పిట్ట పాడిన తీయని పాట రహస్యంగా గాలి అలలలో తేలియాడడం? మరొక పక్షి నల్లని రెక్కలు విప్పి ఆకసంలోకి ఎగరడం, దాన్ని అనుసరించి ఇంకొకటి పోవడం? ఎప్పటిమాటో, అక్కడొక గులాబి నల్లబడటం? ఆ పల్లవి నువ్వు పాడినదే: “ఆ గతిస్తున్నది కాలం కాదు… నువ్వూ… నేనే.” . రస్కిన్ బాండ్ 19 మే 1934 భారతీయ కవి…