(కీట్స్ 220 వ జయంతి సందర్భంగా నివాళి)
.
ఎంతోమంది కనకమణిమయములైన దేశాలు తిరిగి,
గొప్ప సామ్రాజ్యాలనీ, మహానగరాలనీ చూసి ఉండొచ్చు;
నేనుకూడా కవులు సూర్యుడికి సవినయంగా
మొక్కులు చెల్లించే దాపటి ద్వీపాలనెన్నో దర్శించాను.
వాటిలో ఒక సువిశాలమైన ద్వీపాన్ని
గభీరమైన నుదురుగల హోమరు స్వంతం చేసుకున్నాడు;
కానీ, చాప్మన్ స్పష్టంగా, విశదంగా చెప్పేదాకా
అందులోని స్వారస్యాన్ని ఆస్వాదించలేకపోయాను.
మొదటిసారి తన వీక్షణాపరిథిలోకి ఒక కొత్తగ్రహం
వచ్చినపుడు రోదసివీక్షకుడుపొందే అనుభూతి చెందాను.
డేరియన్ శిఖరాగ్రం నుండి డేగకన్నులతో మౌనంగా
ప్రశాంతమహాసాగరాన్ని ఆశ్చర్యంతో తొలిసారి చూస్తున్న
సాహసనావికుడు కోర్టెజ్ లాగ, పట్టలేని విభ్రమంతో, ఆనందంతో
ఒకరినొకరు చూసుకున్న అతని అనుచరుల అనుభూతి పొందాను.
.
జాన్ కీట్స్
31 October 1795 – 23 February 1821
ఇంగ్లీషు కవి
(కీట్స్ ఈ కవితలో కొన్ని ప్రత్యక్ష ఉపమానాలనీ, కొన్ని పరోక్ష ఉపమానాలనీ పొందుపరచాడు. అయితే ముఖ్యమైనది బమ్మెరపోతన గారు భాగవతంలో చెప్పిన “ఇంతింతై వటుడింతయై” అన్న పద్యంలాంటి … అనుభూతులలోని సరిపోలిక. అంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులకి తెలియని ఒక గ్రహాన్ని ఒక శాస్త్రజ్ఞుడు చూసినపుడు కలిగే అనుభూతీ, వినడమే తప్ప అటువంటి మహాసాగరం ఉంటుందని తెలియనప్పుడు దాన్ని మొట్టమొదటిసారి ఒక ఉన్నతమైన కొండశిఖరం మీదనుండి దర్శించినపుడు కలిగే అనుభూతి, నిరుపమానమైనవి. కొన్ని అనుభూతులు మొదటిసారి అనుభవించినపుడు కలిగే ఆనందపారవశ్యం, ఆవేశాల కలగలుపు, నిర్వచనాల పరిథికి అందనిది.
పరోక్షంగా హోమరు ఒక ప్రశాంతమహాసాగరమూ, ఒక వినూత్న గ్రహము వంటివాడని చెప్పక చెబుతున్నాడు. ఒకటి లౌకికము, రెండోది అలౌకికము.)
.

.
On First Loking Into Chapman’s Homer
.
Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne*;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet** swims into his ken;
Or like stout Cortez*** when with eagle eyes
He star’d at the Pacific–and all his men
Look’d at each other with a wild surmise–
Silent, upon a peak in Darien.
.
(Note:
*Demesne: Possession of land as one’s own
**New Planet: Uranus, discovered by Sir William Hershel. It is the first of the series of planets discovered not known to antiquity.
***Vasco Núñez de Balboa, a Spanish Explorer discovered the Pacific Ocean in the early 16th Century, not Cortez)
John Keats
31 October 1795 – 23 February 1821
English Poet
Poem Courtesy:
http://englishhistory.net/keats/poetry/chapmanshomer.html
స్పందించండి