మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు
సంగీతం, జ్ఞాపకాలలో నినదిస్తుంది.
కమ్మని పూవులు వాడిపోయినా,
వాటి నెత్తావి, మేల్కొలిపిన ఇంద్రియంలో పదిలం.
గులాబి రేకులు, గులాబి రాలిపోయినా,
ప్రియుల సమాధులపై పోగుబడతాయి.
అలాగే నువ్వు లేకున్నా, నీ గూర్చిన ఆలోచనలూను;
ప్రేమ ఎప్పుడూ నివురుగప్పి ఉంటుంది.
.
షెల్లీ
4 August 1792 – 8 July 1822
ఇంగ్లీషు కవి.
.
.
Music, when Soft Voices die
.
Music, when soft voices die,
Vibrates in the memory;
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.
స్పందించండి