బాంబు వ్యాసం … యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
ఆ బాంబు వ్యాసం ముఫై సెంటిమీటర్లు,
నలుగురు చనిపోయి, పదకొండుగురు గాయపడేలా
దాని ప్రభావం కనిపించింది 7 మీటర్ల వ్యాసంలో.
వాళ్ళ చుట్టూ … ఇంకా పెద్ద కాల వృత్తంలో
బాధావృతమై రెండు ఆసుపత్రులు చెల్లాచెదరైపోయాయి
ఒక శ్మశానం కూడా. కాని పాపం నగరంలో
ఖననం చెయ్యబడ్డ యువతి వచ్చిన
వందకిలోమీటర్లు పైబడిన దూరమూ కలుపుకుంటే
ఆ వృత్తం ఇంకా పెద్దదవుతుంది.
సముద్రాల్ని దాటి ఎక్కడో దూర దేశపు తీరాల్లో
ఆమెకోశం శోకిస్తున్న ఒంటరి మనిషి దుఃఖం
ఈ ప్రపంచమంతటినీ ఒక వృత్తంలో చుడుతోంది.
భగవంతుని పాదాలసన్నిధిని చేరి, ఇంకా వ్యాపించే
అనాధల ఆక్రందనలగురించి నేను చెప్పదలుచుకోలేదు.
అవికూడా కలిపితే ఆ వృత్తానికి అంతుగాని
ఏ దేముడి ఆచూకీగాని … ఉండదు.
.
యెహుదా అమిఖాయ్
3 May 1924 – 22 September 2000
ఇజ్రేలీ కవి.
.
The Diameter of the Bomb
.
The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the crying of orphans
that reaches up to the throne of God and
beyond, making
a circle with no end and no God.
.
Yehuda Amichai
3 May 1924 – 22 September 2000
Israeli Poet
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి