అనువాదలహరి

జాలి… హెరాల్డ్ వినాల్, అమెరికన్ కవి

ఒక అందమైన వసంతవేళ వీధుల్ని

చల్లని తెమ్మెర సంగీతంతో ముంచెత్తినపుడు

మనసుపారేసుకున్నానని  జాలిపడవద్దు;

ఒకప్పుడు జ్వాలగా రగిలిన నీ ప్రేమని

తిరస్కరించేనని నా మీద జాలిపడవద్దు,

ఇప్పటికీ తాపంతో తపించే పువ్వు

తన హృదయాన్ని తొలకరి చినుకులకి ఆర్తితో ఎదురుచూసినట్టు

వీచే ప్రతిగాలికీ తనహృదయాన్ని ఆరబెట్టినట్టు … నా దప్పితీరలేదు.

జాలిపడదలుచుకుంటే, రాబోయే క్షణాలకు జాలిపడు

సుదూరభవిష్యత్తులో, ఏదో ఒక రోజు మళ్ళీ

నేను ఈ త్రోవనే మన ఇంటి ముంగిట నిలవబోయినపుడు

గుమ్మం నన్ను నా ఆనందానికి దూరం చేస్తుంది.

ఏ తెమ్మెరా నీ వెచ్చని మాట నా చెవికి మోసుకురాదు…

ఒడ్డున భోరున విలపించే సముద్ర కెరటాలు తప్ప!

.

హెరాల్డ్ వినాల్

(1891-1965)

అమెరికన్ కవి

.

Pity

.

Oh do not Pity me because I gave    

My heart when lovely April with a gust,   

Swept down the singing lanes with a cool wave;

And do not pity me because I thrust

Aside your love that once burned as a flame.             

I was as thirsty as a windy flower   

That bares its bosom to the summer shower       

And to the unremembered winds that came.       

Pity me most for moments yet to be,

In the far years, when someday I shall turn               

Toward this strong path up to our little door     

And find it barred to all my ecstasy.

No sound of your warm voice the winds have borne—

Only the crying sea upon the shore

.

Harold Vinal

(1891-1965)

American Poet

 

Poem Courtesy:

Anthology of Massachusetts Poets. 1922.

Ed. William Stanley Braithwaite, (1878–1962).

http://www.bartleby.com/272/84.html

%d bloggers like this: