అనువాదలహరి

మొర… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

అంతా మారిపోయింది… నేను పేదనైపోయాను;

మొన్న మొన్నటి వరకూ, నీ ప్రేమ

నా హృదయ కవాటం ముందు

ప్రవహించడమే తన ధర్మంగా ఉండేది.

నా అవసరం, దాని ఔదార్యం అన్న

ఆలోచన లేకుండా అనంతంగా ప్రవహించింది. 

ఎన్ని మధుర క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేను!

కైవల్యాన్ని మించిన ఆనందంలో మునకలేశాను నేను!

గలగలా, తళతళా, నిత్య చైతన్యంతో

ప్రవహించిన పవిత్రమైన ప్రేమకు బదులు, ఇప్పుడు,

నా దగ్గర ఏముంది? ఏముందని ధైర్యంగా చెప్పను?

పాడుబడి, అగాధమైన,

అగోచరమైన దిగుడుబావి తప్ప!

ఒక ప్రేమామృతపు చెలమ… బాగా లోతుగా ఉండొచ్చు…

అది ఎన్నటికీ ఇంకిపోదని నమ్ముతున్నాను.

అయినా పెద్దతేడా ఏముంది, అక్కడి ఊట

లోలోపలే నిశ్చలంగా, అందుబాటులో లేనపుడు?

అదిగో, ఆ మార్పే, అదీ నా గుండె కవాటం ముందు

నన్ను నిరుపేదను చేసింది.

.

విలియం వర్డ్స్  వర్త్

7 April 1770 – 23 April 1850

ఇంగ్లీషు కవి .

.

William_Wordsworth

.

A Complaint

.

There is a change–and I am poor;

Your love hath been, not long ago,

A fountain at my fond heart’s door,

Whose only business was to flow;

And flow it did; not taking heed

Of its own bounty, or my need.

 

What happy moments did I count!

Blest was I then all bliss above!

Now, for that consecrated fount

Of murmuring, sparkling, living love,

What have I? Shall I dare to tell?

A comfortless and hidden well.

 

A well of love–it may be deep–

I trust it is,–and never dry:

What matter? If the waters sleep

In silence and obscurity.

–Such change, and at the very door

Of my fond heart, hath made me poor.

 

— William Wordsworth

 

.

 

 

%d bloggers like this: