కానుకలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి
మనిషికి అతను స్వారీ చెయ్యగల గుర్రాన్నీ
నడపగల ఓడనీ ఇవ్వు;
అతని హోదా, సంపదా, శక్తీ, ఆరోగ్యం
నేలమీదగాని, నీటిమీదగాని చెడవు.
మనిషికి అతను తాగగలిగిన చుట్టా
అతను చదవగలిగిన పుస్తకమూ ఇవ్వు;
అతని ఇంట్లో ఏమీ లేకపోవచ్చు గాక,
కానీ ప్రశాంతతతో కూడిన ఆనందం వెల్లివిరుస్తుంది.
మనిషికి తను ప్రేమించగలిగిన స్త్రీని ఇవ్వు,
ప్రియతమా, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు,
అతని హృదయం అదృష్టంతో ఉరకలేస్తుంది
ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా.
.
జేమ్స్ థామ్సన్
స్కాటిష్ కవి
.
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A_Voice_from_the_Nile,_and_Other_Poems,_frontispiece.png
.
Gifts
Give a man a horse he can ride,
Give a man a boat he can sail;
And his rank and wealth, his strength and health,
On sea nor shore shall fail.
Give a man a pipe he can smoke,
Give a man a book he can read:
And his home is bright with a calm delight,
Though the room be poor indeed.
Give a man a girl he can love,
As I, O my love, love thee;
And his heart is great with the pulse of Fate,
At home, on land, on sea.
.
James Thomson. (pseudonym Bysshe Vanolis, or B.V. )
Nov. 23, 1834 – June 3, 1882
Scottish Poet
The Oxford Book of English Verse: 1250–1900.
Ed: Arthur Quiller-Couch, 1919.