అనువాదలహరి

మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, ఇంగ్లీషు రచయిత్రి

(ఇది చాలా ప్రతిభావంతమైన కవిత. ఏ అలంకారాలూ లేనట్టు కనిపించినా, పదునైన వ్యంగ్యం ఉంది ఇందులో.ఇంగ్లండు ప్రథానమంత్రి థాచర్ ప్రభుత్వం చేపట్టిన విధానాలకు 30 లక్షలమంది నిరుద్యోగులుగా మారినపుడు రాసిన కవిత ఇది.

ఓట్లు దండుకుందికి, అందరూ మొసలి కన్నీళ్ళు కారుస్తారు.  పాకలలో దూరుతారు. వాళ్ల మంచాలమీద కూర్చుని చెప్పలేని సానుభూతి ఒలక బోస్తారు. అదంతా అందలం ఎక్కడనికే తప్ప వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి కాదు. ఈ సత్యాన్ని చాలా నిశితంగా విమర్శించిన కవిత)

మిసెస్ థాచర్,  నువ్వు నిజంగా ఏడుస్తావా?

మిసెస్ థాచర్, ఎన్నడైనా నువ్వు నిద్రలోంచి ఉలికిపడి లెస్తావా?

నువ్వు ఎప్పుడైనా విల్లో చెట్టులా శోకిస్తావా?

అందులోనూ ఖరీదైన “మార్క అండ్ స్పెన్సర్” తలగడమీద?

నీ కన్నీళ్ళు మరిగిన ఉక్కులా ఉంటాయా?

నిజంగా నీకు ఏడుపు వస్తుందా?

నీకు నిద్రలేవగానే “30 లక్షల” అంకె కళ్ళముందు మెదుల్తుందా?

వాళ్ళకి మరి పనిదొరకదని నువ్వెన్నడైనా బాధపడతావా?

నువ్వు అద్దంలో సింగారించుకుంటున్నప్పుడు,

క్యూలో నిలబడే మనుషులెన్నడైనా గుర్తొస్తారా?

మిసెస్ థాచర్, నువ్వు నిజంగా ఏడుస్తావా?

.

స్యూ టౌన్ సెండ్

2 April 1946 – 10 April 2014

ఇంగ్లీషు రచయిత్రి .

.

Mrs. Thatcher

.

Do you weep, Mrs Thatcher, do you weep?

Do you wake, Mrs Thatcher, in your sleep?

Do you weep like a sad willow?

On your Marks and Spencer’s pillow?

Are your tears molten steel?

Do you weep?

Do you wake with ‘Three million’ on your brain?

Are you sorry that they’ll never work again?

When you’re dressing in your blue, do you see the waiting queue?

Do you weep, Mrs Thatcher, do you weep?

.

Sue Townsend  (Susan Lillian “Sue” Townsend)

2 April 1946 – 10 April 2014

British Authoress

%d bloggers like this: