అనువాదలహరి

చివరకి… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

కాలం కూడా ఎలాంటి దంటే, మన యవ్వనం,

మన సుఖాలు, మన సర్వస్వం కుదువబెట్టుకుని,

చివరకి మనకి మన్నూ, మశానంతో తీర్మానం చేస్తుంది;

మనం జీవితాంతమూ ఎంత తిరిగినా

ఆ నీరవ నిశ్శబ్ద చీకటి కుహరంలో

మన జీవిత గాథని మరుగుచేస్తుంది;

కానీ, నాకు నమ్మకం ఉంది: భగవంతుడు

నన్ను ఈ నేల,ఈ సమాధి, ఈ మట్టిలోంచి లేపుతాడు.
.

సర్ వాల్టర్ రాలీ

1554 – 29 October 1618

ఇంగ్లీషు కవి

.

The Conclusion

 

Even such is Time, that takes in trust

Our youth, our joys, our all we have,

And pays us but with earth and dust;

Who in the dark and silent grave,

When we have wander’d all our ways,

Shuts up the story of our days;

But from this earth, this grave, this dust,

My God shall raise me up, I trust.

.

Sir Walter Raleigh.

1554 – 29 October 1618

English Poet

Poem courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/78.html

 

 

 

%d bloggers like this: