అనువాదలహరి

అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి

నా మీద ఆఖరి అస్త్రం ప్రయోగించడానికా అన్నట్టు

ప్రేమ ఎటువంటి శతృవుని సృష్టించిందంటే

ఆమెలో రెండు అందాలూ ఎంతో సొగసుగా కలగలసి 

నేను మరణమెదురైనా ఒప్పుకోక తప్పని స్థితి; 

ఆమె కళ్ళు నా హృదయాన్ని బందీని చేస్తే 

తన గాత్రం నా మనసుని వివశం చేస్తోంది.

కేవలం అందంగా మాత్రమే ఉంటే దూరంగా పోగలిగేవాణ్ణి;

దట్టమైన ఆమె ఉంగరాలజుట్టు బంధనాలు

తెంచుకున్న ఆత్మను కాపాడుకోగలవాణ్ణేమో;

కానీ, నేర్పుగా, కనిపించకుండా

నాకు ప్రాణమందిస్తున్న వాయువుతోనే నన్ను బంధిస్తున్న

ఆమె కళకి దాసుడిని కాకుండా ఎలా ఉండగలను? 

ఏ రణరంగంలోనో పోరాడడం ఇంతకంటే మెరుగు 

అక్కడ గెలుపు ఓటములు సమ ఉజ్జీలుగా ఉండే అవకాశం ఉంది.

అందమైన నేత్ర, గాత్రాల సానుకూలతగల ఆమె ముందు

ఏ ప్రతిఘటనా ఎక్కువసేపు నిలబడదు.

భూవ్యాకాశాలను జయించిన ఆమెముందు

నా శక్తులన్నీ దాసోహమనక తప్పదు.

.

ఏండ్రూ మార్వెల్

31 March 1621 – 16 August 1678

ఇంగ్లీషు కవి.

.

.

The Fair Singer

.

To make a final conquest of all me,

Love did compose so sweet an enemy,

In whom both beauties to my death agree,

Joining themselves in fatal harmony,

That, while she with her eyes my heart does bind,

She with her voice might captivate my mind.

I could have fled from one but singly fair;

My disentangled soul itself might save,

Breaking the curled trammels of her hair;

But how should I avoid to be her slave,

Whose subtle art invisibly can wreathe

My fetters of the very air I breathe?

It had been easy fighting in some plain,

Where victory might hang in equal choice,

But all resistance against her is vain,

Who has the advantage both of eyes and voice;

And all my forces needs must be undone,

 She having gained both the wind and sun.

,

Andrew Marvell

31 March 1621 – 16 August 1678

English Poet

Poem Courtesy:

The Book of Restoration Verse.  1910.
Ed. William Stanley Braithwaite,

 

.

Andrew Marvell

31 March 1621 – 16 August 1678

English Poet

%d bloggers like this: