మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు … డిలన్ థామస్, వెల్ష్ కవి

(మరణంతో జీవితం పరిసమాప్తమవుతుందనుకునేవారికి ఆత్మకి చావులేదనీ, సృష్టి అంతంలో అన్ని జీవాత్మలో పరమాత్మలో చేరవలసిందేనని, కనుక మృత్యువుకి అంతిమ విజయం కాదని ఒకవైపు; దైవం మీద నమ్మకం లేనివారికి  ఈ భౌతిక ప్రాంచం ఉన్నంతకాలమూ మనం మూల ధాతువులుగా రూపాంతరం చెందుతూనే ఉంటాము కనుక, మృత్యువు అన్నది ఒక ఆకృతినుంది మరొక ఆకృతికి మారే క్రమంలో ఒక విరామమే తప్ప శాశ్వతం కాదనీ  … సందేశాన్ని అందివ్వడమే ఈ కవిత తాత్పర్యం.)

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

దిగంబరులైన మృతులందరూ

తిరిగి సజీవులుగానో, దిగంతాలలోనో ఉంటారు;

వాళ్ళ అస్థికలు నిర్మలంగా బయటపడినా, శిధిలమైనా

వాళ్ళ భుజాలపైనా, పాదాల చెంతా నక్షత్రతతులుంటాయి;

వాళ్ళకి మతి తప్పినా, స్థిమితంగానే ఉంటారు,

వాళ్లు సముద్రంలో మునిగినా, మళ్ళీ బయటకు లేస్తారు;

ప్రేమికులు ఎడబాటు కావచ్చునేమో గాని ప్రేమ కాదు;

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

సముద్రపు లో లోపలి ఆవర్తాలలో

ఎంతకాలం ఉండిపోయినా, వాళ్ళు ఊపిరాడక పోరు;

నాడులు పట్టుతప్పి రాళ్ళపై వంపులు తిరిగినపుడు

ఏ చక్రానికో చిక్కుకున్నా, వాళ్ళు పగుళ్ళుబారరు,

వాళ్ల చేతుల్లో నమ్మకం కూడా చిక్కుకుంటుంది.

వాళ్ళగుండెల్లోంచి ఎన్ని పాపాల కొమ్ములు దూసుకెళ్ళి

అనేక ఖండాలు చేసినా, వాళ్ళు లొంగరు

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు

వాళ్ళ చెవులకి సీ-గల్స్ అరుపులు వినిపించకపోవచ్చు

తీరాన్న చప్పుడుచేస్తూ పడే అలలు తెలియకపోవచ్చు

వర్షపు చినుకులకు పూలు తలెత్తినచోట

ఇపుడు ఏ పూవూ తలెత్తకపోవచ్చు

వాళ్ళు ఇప్పుడు కొయ్యకుకొట్టిన మేకుల్లా అచేతనులవొచ్చు

ఆ పూల పరంపర క్రింద మనుషుల ముఖాలు మారుతూండొచ్చు

వాళ్ళు సూర్యుడున్నంతకాలమూ, కొత్తగా జీవిస్తారు.

మృత్యువుకి  ఏలగల సామ్రాజ్యం లేదు

.

డిలన్ థామస్

27 October 1914 – 9 November 1953

వెల్ష్ కవి

 

.

Dylan Thomas

.

And Death Shall Have No Dominion

 

And death shall have no dominion.

Dead men naked they shall be one

With the man in the wind and the west moon;

When their bones are picked clean and the clean bones gone,

They shall have stars at elbow and foot;

Though they go mad they shall be sane,

Though they sink through the sea they shall rise again;

Though lovers be lost love shall not;

And death shall have no dominion.

 

And death shall have no dominion.

Under the windings of the sea

They lying long shall not die windily;

Twisting on racks when sinews give way,

Strapped to a wheel, yet they shall not break;

Faith in their hands shall snap in two,

And the unicorn evils run them through;

Split all ends up they shan’t crack;

And death shall have no dominion.

 

And death shall have no dominion.

No more may gulls cry at their ears

Or waves break loud on the seashores;

Where blew a flower may a flower no more

Lift its head to the blows of the rain;

Though they be mad and dead as nails,

Heads of the characters hammer through daisies;

Break in the sun till the sun breaks down,

And death shall have no dominion.

 

Dylan Thomas

Welsh Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2004/03/and-death-shall-have-no-dominion-dylan.html

For very interesting analysis and interpretations of readers visit:

http://www.eliteskills.com/analysis_poetry/And_Death_Shall_Have_No_Dominion_by_Dylan_Thomas_analysis.php

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: