పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి

సుతిమెత్తగా ఆ ఆకుని ఒత్తి చూడు,

అది నీకు దురదపెట్టి బాధిస్తుంది;

అదే సాహసంతో దాన్ని తెంపిచూడు

అది పట్టులా చేతిలో ఒదుగుతుంది.

మనుషుల స్వభావంతోనూ అంతే,

వాళ్ళని దయగా చూడు, తిరగబడతారు;

అదే జాజికాయ కోరాల్లా కరుకుగా ఉండు,

ఆ ధూర్తులే, అణిగిమణిగి ఉంటారు.

.

ఏరోన్ హిల్

(10 February 1685 – 8 February 1750)

ఇంగ్లీషు నాటక కర్తా, కవి.

.

 

A Useful Hint

 .

Tender-Handed stroke a nettle,       

And it stings you for your pains;   

Grasp it like a man of mettle,           

And it soft as silk remains.        

      

’Tis the same with common natures,                     

Use them kindly they rebel;            

But be rough as nutmeg graters,      

And the rogues obey you well.

.

Aaron Hill

(10 February 1685 – 8 February 1750)

English Dramatist, poet

 

The Book of Georgian Verse. 1909.

Ed. William Stanley Braithwaite,

http://www.bartleby.com/333/93.html

 

“పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు

  1. కవి మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అంటారా? అందుకు కఠినంగానే ఉండమని సలహా నా?

    మెచ్చుకోండి

    1. నమస్తే శర్మగారూ,
      అది అందరివిషయంలోనూ కాదు. కొందరికి సునితమైన భావావేశాలు, వాటిని ప్రకటించే తీరు అర్థం కావు. అర్థం చేసుకోలేరు. దానికి చాలా fine sensibilities కావాలి. వాళ్ళకి మొరటుదనం, aggressiveness మాత్రమే తెలుసు. అందుకని వాళ్ళు అలాగే ఉంటారు, అలాంటి భావావేశాలకే స్పందిస్తారు అని. ఏది ఏమైనా ఇలాంటి సలహాలు సూచనలు కొంత నిర్దిష్టమైన పరిమితులలోనే చలామణీ అవుతాయి. సార్వత్రిక న్యాయాలు కావు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: