అనువాదలహరి

పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి

సుతిమెత్తగా ఆ ఆకుని ఒత్తి చూడు,

అది నీకు దురదపెట్టి బాధిస్తుంది;

అదే సాహసంతో దాన్ని తెంపిచూడు

అది పట్టులా చేతిలో ఒదుగుతుంది.

మనుషుల స్వభావంతోనూ అంతే,

వాళ్ళని దయగా చూడు, తిరగబడతారు;

అదే జాజికాయ కోరాల్లా కరుకుగా ఉండు,

ఆ ధూర్తులే, అణిగిమణిగి ఉంటారు.

.

ఏరోన్ హిల్

(10 February 1685 – 8 February 1750)

ఇంగ్లీషు నాటక కర్తా, కవి.

.

 

A Useful Hint

 .

Tender-Handed stroke a nettle,       

And it stings you for your pains;   

Grasp it like a man of mettle,           

And it soft as silk remains.        

      

’Tis the same with common natures,                     

Use them kindly they rebel;            

But be rough as nutmeg graters,      

And the rogues obey you well.

.

Aaron Hill

(10 February 1685 – 8 February 1750)

English Dramatist, poet

 

The Book of Georgian Verse. 1909.

Ed. William Stanley Braithwaite,

http://www.bartleby.com/333/93.html

 

%d bloggers like this: